త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Avinya27 | యువ ఆవిష్కర్తలకు కేంద్రం పిలుపు.. అవిన్యా 27 ఎనర్జీ స్టార్టప్ ఛాలెంజ్‌..

Avinya27 | భారత ఇంధన రంగంలో ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించే లక్ష్యంతో అవిన్యా 27 ఎనర్జీ స్టార్టప్ ఛాలెంజ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోని అత్యుత్తమ ప్రతిభావంతులను ఇంధన రంగంలో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల వైపు తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

S

Business | Published On Aug 24, 2026, 2.52 pm IST

Avinya27 | యువ ఆవిష్కర్తలకు కేంద్రం పిలుపు.. అవిన్యా 27 ఎనర్జీ స్టార్టప్ ఛాలెంజ్‌..
Advertisement

Avinya27 | భారత ఇంధన రంగంలో ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించే లక్ష్యంతో అవిన్యా 27 ఎనర్జీ స్టార్టప్ ఛాలెంజ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోని అత్యుత్తమ ప్రతిభావంతులను ఇంధన రంగంలో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల వైపు తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. శుద్ధ ఇంధన సాంకేతికతను అభివృద్ధి చేసే, స్థిరమైన పరిష్కారాలను అందించే వినూత్న ఆలోచనలను ఈ కార్యక్రమం ద్వారా ఆహ్వానిస్తోంది. భారత్ ఇంధన స్వావలంబన దిశగా వేగంగా మారేందుకు దోహదపడే పరిష్కారాలను రూపొందిస్తున్న స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు ఇందులో పాల్గొనవచ్చు.

వినూత్న ప‌రిష్కారాల‌ను ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం..

అవిన్యా 27 ఎనర్జీ స్టార్టప్ ఛాలెంజ్‌లో భాగంగా భారత ఇంధన రంగాన్ని తీర్చిదిద్దుతున్న వినూత్న పరిష్కారాలను ప్రదర్శించే అవకాశం కల్పించనున్నారు. స్థిరమైన అభివృద్ధి, సామాజిక-ఆర్థిక ప్రభావం, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు దోహదపడే ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎంపికైన స్టార్టప్‌లకు 2027లో జరిగే ఇండియా ఎనర్జీ వీక్‌లో తమ ఆవిష్కరణలను ప్రదర్శించే అవకాశం లభించనుంది. ఇంధన రంగంలో కొత్త సాంకేతికతలు, సుస్థిర పరిష్కారాలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ఉంది.

https://twitter.com/mygovindia/status/2091770424732553333?s=20

ద‌ర‌ఖాస్తు ఎలా..

ఈ కార్యక్రమాన్ని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ, ఇండియా ఎనర్జీ వీక్, మైగవ్ తదితర సంస్థల సహకారంతో నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఇన్నోవేట్ ఇండియా మైగవ్ వెబ్‌సైట్ ద్వారా అవిన్యా 27 ఎనర్జీ స్టార్టప్ ఛాలెంజ్‌లో పాల్గొనవచ్చని కేంద్రం వెల్లడించింది.

Advertisement
Advertisement