త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TUJV Memorandum | మ‌మ్మ‌ల్ని న‌డిరోడ్డుపై వ‌దిలేశారు.. మాకు ఫ‌స్ట్ ప్ర‌యారిటీ ఇవ్వండి

TUJV Memorandum | తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఉద్యమ జర్నలిస్టుల కష్టాలు తొలగిపోలేదని.. త‌మ‌కు ఏ సమైక్యాంధ్ర మీడియా సంస్థలు ఉద్యోగాలు ఇవ్వ‌లేద‌ని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక కన్వీనర్ భారత సుదర్శన్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌మ్మ‌ల్ని వాడుకొని న‌డిరోడ్డుపై వ‌దిలేశార‌న్నారు. ఇండ్ల కేటాయింపులో త‌మ‌కే ఫ‌స్ట్ ప్ర‌యారిటీ ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

S

Telangana | Published On Jul 21, 2026, 6.47 pm IST

TUJV Memorandum | మ‌మ్మ‌ల్ని న‌డిరోడ్డుపై వ‌దిలేశారు.. మాకు ఫ‌స్ట్ ప్ర‌యారిటీ ఇవ్వండి
Advertisement
  • ఉద్యమ కొలిమిని రగిల్చి పోరాట జ్వాల ఆరిపోకుండా చూశాం
  • ఇండ్లు, ఆరోగ్య భ‌ద్ర‌త క‌ల్పించండి
  • కే కేశ‌వ‌రావుకు టీయూజేవీ కన్వీనర్ భారత సుదర్శన్ విన‌తి

త్రినేత్ర‌.న్యూస్: తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఉద్యమ జర్నలిస్టుల కష్టాలు తొలగిపోలేదని.. త‌మ‌కు ఏ సమైక్యాంధ్ర మీడియా సంస్థలు ఉద్యోగాలు ఇవ్వ‌లేద‌ని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక కన్వీనర్ భారత సుదర్శన్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌మ్మ‌ల్ని వాడుకొని న‌డిరోడ్డుపై వ‌దిలేశార‌న్నారు. ఇండ్ల కేటాయింపులో త‌మ‌కే ఫ‌స్ట్ ప్ర‌యారిటీ ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈమేరకు మంగ‌ళ‌వారం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె.కేశవరావును అమరవీరుల స్థూపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సంద‌ర్భంగా సుద‌ర్శ‌న్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల కుటుంబాలు అనేక ఇబ్బందులను ఇప్పటికీ ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు మమ్మల్ని వాడుకొని నడిరోడ్డుపైన వదిలేసాయి. కిందిస్థాయిలో పనిచేసిన, ప్ర‌స్తుతం చేస్తున్న వందలాది మంది తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ప్రభుత్వాలు ఏమాత్రం న్యాయం చేయలేదు. అన్ని రకాల జీవన సౌకర్యాలను కోల్పోయాం. మా తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. శాశ్వత నివాసం, శాశ్వత ఆరోగ్య భద్రతను కల్పించాలి అని సుదర్శన్ ప్రభుత్వానికి విన్న‌వించారు.

తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులుగా తెలంగాణ ప్రజల చిరకాల కాంక్ష అయిన "తెలంగాణ స్వరాష్ట్ర సాధన' ఉద్యమంలో శిఖరాగ్రస్థాయిలో పనిచేసి, తెలంగాణ ఉద్యమంలో మమేకమైన సంగతి అందరికీ తెలిసిందే. ఉద్యమ సమయంలో మా ఉద్యోగాలు కోల్పోయాం. కుటుంబాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా కూడా మొక్కవోని దీక్షతో ఉద్య‌మంలో పాల్గొన్నాం.

తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులుగా మేం ఆనాడు సమైక్య పాలనలో పోలీసుల నిర్భంధాలతో పాటు అనేక ఇబ్బందులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎదుర్కొన్నాం. అన్ని పక్షాలు నెత్తిన తడిబట్ట వేసుకొని కూర్చున్నప్పుడు కూడా జర్నలుస్టులుగా మేం ఉద్యమ కొలిమిని రగిల్చాం. తెలంగాణ ఉద్యమ పోరాట జ్వాల ఆరిపోకుండా.. ఆగకుండా చూశాం. ఈ విషయం ప్రపంచానికి తెలుసు అని ఆయ‌న గుర్తు చేశారు.

విన‌తి ప‌త్రం ఇచ్చిన వారిలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక నాయకులు మహేశుని లక్ష్మయ్య నేత, కాసాని శ్రీనివాసరావు, బాయికాడి వెంకట్, వినోద్, శివకోటి, నాగరాజు యాదవ్ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement