Delhi Tour of Congress Leaders | ఎల్‌నినోపై మీటింగన్నారు.. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు
Delhi Tour of Congress Leaders | గత కొన్ని నెలలుగా ఎల్‌నినో (El Nino) ప్రభావ పరిస్థితులపై ఏదో చేస్తున్నట్లు చెప్పుకొస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్యం మరోమారు బయటపడ్డట్లైంది.
- చర్చంటూ సీఎస్ సర్క్యులరూ ఇచ్చారు
- అంతలోనే సీఎం రేవంత్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా హస్తినకు పయనం
- రాష్ట్ర సమస్యలను వదిలి దేశ సమస్యలపై పడడం ఏంటని ప్రజల గుర్రు
Delhi Tour | త్రినేత్ర న్యూస్: గత కొన్ని నెలలుగా ఎల్‌నినో (El Nino) ప్రభావ పరిస్థితులపై ఏదో చేస్తున్నట్లు చెప్పుకొస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్యం మరోమారు బయటపడ్డట్లైంది. ఎల్‌నినోపై ఎంత సీరియస్‌గా ఉన్నదో చెప్పేందుకు ఇంతకన్నా ఇంకేం రుజువు కావాలి. సోమవారం ఎల్‌నినోపై చర్చించాలని మంత్రులంతా ఇక్కడే ఉండాలని చెప్తూ.. ప్రభుత్వం మొన్నటికి మొన్న అంటే ఈనెల 9నే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (Sanjay Jaju) ఉత్తర్వులూ ఇచ్చారు. కానీ ఏం లాభం.. అంతా తుస్ అన్న చందంగా మారింది. మీటింగ్‌ను, రాష్ట్ర సమస్యలను పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఎంచక్కా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు.
కాంగ్రెస్ అనుకూల మీడియా ఇక సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారని ఊదరగొడుతూ వార్తలు అచ్చు వేసింది కూడా. దీంతో అంతా నిజమే అని నమ్మారు. ఈరోజు 11 గంటలకే మీటింగ్ ఉంటదని, ఇన్ఫర్మల్ కేబినెట్ అని అధికారులు కూడా రెడీ అయ్యారు. ఇక ఇవన్నీ ఉత్తవన్నట్టే ఆదివారం సీఎం రేవంత్ గోవా వేళ్లిపోయారు. అక్కడినుంచటే హస్తినకు పయనమయ్యారు. ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ మీటింగ్, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటారని ప్రకటించారు.
అయితే ఈరోజు నిర్వహించాల్సిన అనధికార మంత్రివర్గ సమావేశాలపై ఎవ్వరికీ ఎటువంటి స్పష్టత లేకపోవడం.. మరోవైపు సీఎస్ కూడా తనకేమీ తెలియదని జీఏడీ అధికారులతో అన్నట్టు వినిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలను పక్కనబెట్టి దేశంలోని సమస్యలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | గురుకుల అవినీతిపై సీఎంకు ఫిర్యాదా?.. కుంభకోణం సూత్రధారే రేవంత్ రెడ్డి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అక్టోబర్ 12, 2026

Bathukamma | తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా.. దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు
అక్టోబర్ 12, 2026

Dasoju Sravan Kumar | విద్యావంతుల మౌనంతోనే అనర్హులకు అధికారం : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
అక్టోబర్ 11, 2026
తాజావార్తలు
- ●TCS Dividend | ఈ వారం డివిడెండ్ ప్రకటించిన 4 స్టాక్స్.. రికార్డు తేదీలు ఇవే..
- ●RS Praveen Kumar | గురుకుల అవినీతిపై సీఎంకు ఫిర్యాదా?.. కుంభకోణం సూత్రధారే రేవంత్ రెడ్డి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●IPO | ఈ వారం నాలుగు ఐపీఓలు.. సబ్స్క్రిప్షన్ ఎప్పుడంటే..
- ●Bathukamma | తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా.. దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత.. పెట్టుబడి పెట్టాలా, వేచి చూడాలా..?
- ●Nagarjuna Sagar | తాగునీటి అవసరాలకు.. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల

TCS Dividend | ఈ వారం డివిడెండ్ ప్రకటించిన 4 స్టాక్స్.. రికార్డు తేదీలు ఇవే..

RS Praveen Kumar | గురుకుల అవినీతిపై సీఎంకు ఫిర్యాదా?.. కుంభకోణం సూత్రధారే రేవంత్ రెడ్డి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

IPO | ఈ వారం నాలుగు ఐపీఓలు.. సబ్స్క్రిప్షన్ ఎప్పుడంటే..

Bathukamma | తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా.. దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు



