త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemula Prashanth Reddy | టీ ష‌ర్ట్స్‌పై రేవంత్ బడువే మాటలు లేవ్

Vemula Prashanth Reddy | టీ ష‌ర్ట్స్‌పై రేవంత్ బడువే మాటలు లేవని.. కింద ప‌డేసి తొక్కుతా అన్న మాట‌లు అంత‌క‌న్నా లేవ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్ర‌శాంత్‌రెడ్డి విమర్శించారు. బ్లాక్ టీ ష‌ర్ట్స్ రేవంత్‌కు న‌చ్చ‌డం లేద‌ని.. ప‌చ్చ క‌ల‌ర్‌వి ఏసుకుంటే న‌చ్చుతుందేమోన‌ని వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Sep 7, 2026, 3.19 pm IST

Vemula Prashanth Reddy | టీ ష‌ర్ట్స్‌పై రేవంత్ బడువే మాటలు లేవ్
Advertisement
  • ప‌చ్చ క‌ల‌ర్‌వి ఏసుకుంటే మంచిదేమో
  • ఇంత‌టి గూండాగిరి ఎన్న‌డు చూడ‌లే
  • బీజేపీ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించినా ఏమ‌న‌లేదు
  • రేవంత్ పొద్దున కాంగ్రెస్‌తో సాయంత్రం బీజేపీతో ఉంటడు
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్ర‌శాంత్‌రెడ్డి ధ్వ‌జం

Vemula Prashanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: టీ ష‌ర్ట్స్‌పై రేవంత్ బడువే మాటలు లేవని.. కింద ప‌డేసి తొక్కుతా అన్న మాట‌లు అంత‌క‌న్నా లేవ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్ర‌శాంత్‌రెడ్డి విమర్శించారు. బ్లాక్ టీ ష‌ర్ట్స్ రేవంత్‌కు న‌చ్చ‌డం లేద‌ని.. ప‌చ్చ క‌ల‌ర్‌వి ఏసుకుంటే న‌చ్చుతుందేమోన‌ని వ్యాఖ్యానించారు. త‌న‌ను రెండుసార్లు వాహనంలో ఎత్తేశారని.. ఇంతటి గూండాగిరి ఎన్నడు చూడలేదని మండిప‌డ్డారు. ఆదివారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌పై తీవ్ర స్థాయిలో ఫైర‌య్యారు. రేవంత్ పొద్దున కాంగ్రెస్‌తో సాయంత్రం బీజేపీతో ఉంటాడ‌ని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ క‌లిసిపోయాయ‌న్నారు.

కేటీఆర్‌ను పోలీసులు కింద‌ వేసి తొక్కింది తెలంగాణ మొత్తం చూసింది. రేవంత్ రెడ్డి చిల్లర దౌర్జన్యకాండ చేశాడు. హామీల అమలులో కాంగ్రెస్ విఫల‌మైంది. వెయ్యి రోజుల పాలన నిష్ఫలం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్‌లో మోదీ, అదానీ టీ షర్ట్స్ వేసుకున్నారు. రాహుల్‌కు ఒక న్యాయం.. కేటీఆర్, హరీష్ రావుకు ఒక న్యాయమా.! శాంతియుత మార్గంలో మేం నిరసన తెలియజేశాం.

పోలీసులు మాజీ హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గొంతు నొక్కారు. ఇదేనా ప్రజా పాలన అంటే? సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకొని లాగారు. తోపులాటలో హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సంజయ్ కింద పడ్డారు. భౌతికంగా మా నాయకుడు కేటీఆర్‌పై దాడి చేశారు. తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలి.

రేవంత్ రెడ్డి శిఖండి రాజకీయం చేస్తున్నాడు. ఆయ‌న కంటే శిఖండి నయం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను అపహాస్యం చేస్తున్నారు. మమ్మల్ని అవమానించినట్టే కేసీఆర్‌ను అవమానించాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి బండారం బయటపడుతుంది. అందుకే ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి రానివ్వడం లేదు. అసెంబ్లీ బయట రెండు వేల మంది పోలీసులు ఉన్నారు. రెండు సార్లు నన్ను వాహనంలో ఎత్తేశారు. ఇంతటి గూండాగిరి ఎన్నడు చూడలేదు.

మేం కేసీఆర్ సైనికులం. భ‌యపడేది లేదు. బుద్ధి జీవులు తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయండి. బ్లాక్ టీషర్ట్స్ వేసుకుంటే మమ్మల్ని అడ్డుకున్నారు. బీజేపీ సభలో ప్ల కార్డులు ప్రదర్శిస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ ములాఖాత్ ప్రజలకు అర్థమైంది. మేం బ్లాక్ టీ షర్ట్స్ వేసుకుంటే మమ్మల్ని అడ్డుకున్నారు. బీజేపీ, రేవంత్ రెడ్డి కలిసిపోయారు. రేవంత్ పొద్దున కాంగ్రెస్‌తో, సాయంత్రం బీజేపీతో ఉంటాడు అని వేముల ఆరోపించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement