త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI ATM | ఎస్‌బీఐ ఏటీఎం చోరీకి విఫ‌ల‌య‌త్నం.. అలారం మోగ‌డంతో సీసీకెమెరాలు ఎత్తుకెల్లిన దుండ‌గుడు

SBI ATM | కామారెడ్డి (Kamareddy) జిల్లాకేంద్రంలో ఎస్‌బీఐ ఏటీఎంలో (SBI ATM) చోరీకి విఫ‌ల‌య‌త్నం జ‌రిగింది. బుధ‌వారం అర్ధరాత్రి 1.06 గంట‌ల స‌మ‌యంలో జేపీఎన్‌ రోడ్డులోని ఏటీఎం కేంద్రంలోకి ఓ దుండ‌గుడు వ‌చ్చాడు.

G

Telangana | Published On Nov 12, 2026, 9.17 am IST

SBI ATM | ఎస్‌బీఐ ఏటీఎం చోరీకి విఫ‌ల‌య‌త్నం.. అలారం మోగ‌డంతో సీసీకెమెరాలు ఎత్తుకెల్లిన దుండ‌గుడు
Advertisement

SBI ATM | త్రినేత్ర న్యూస్‌: కామారెడ్డి (Kamareddy) జిల్లాకేంద్రంలో ఎస్‌బీఐ ఏటీఎంలో (SBI ATM) చోరీకి విఫ‌ల‌య‌త్నం జ‌రిగింది. బుధ‌వారం అర్ధరాత్రి 1.06 గంట‌ల స‌మ‌యంలో జేపీఎన్‌ రోడ్డులోని ఏటీఎం కేంద్రంలోకి ఓ దుండ‌గుడు వ‌చ్చాడు. ఇనుపరాడ్‌తో ఏటీఎం త‌లుపును (Theft) ప‌గ‌ల‌గొట్టాడు. దానిని ధ్వంసం చేయడానికి యత్నించాడు. అయితే ఏటీఎం కేంద్రానికి ఏర్పాటు చేసిన ఈ-సర్వైలెన్స్‌ వ్యవస్థ ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించిన సిబ్బంది వెంటనే అలారం మోగించారు. దీంతో అప్రమత్తమైన అత‌డు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ క్ర‌మంలో ఏటీఎం కేంద్రం వద్ద ఉన్న సీసీ కెమెరాలను (CCTV Camera) ఎత్తుకెళ్లాడు.

స‌మాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీల‌ను జ‌ల్ల‌డ‌ప‌డుతున్నారు. దుండ‌గుడు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement
Advertisement