త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ASRB Recruitment | ఐకార్‌, క్రిషి విజ్ఞాన కేంద్రాల్లో ఉద్యోగాలు.. 1393 పోస్టుల‌తో ASRB నోటిఫికేష‌న్‌

ASRB Recruitment | కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ ప‌రిధిలోని అగ్రిక‌ల్చుర‌ల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ASRB) ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చుర‌ల్ రీసెర్చ్ (ICAR), క్రిషి విజ్ఞాన కేంద్రాల్లో (KVKs) ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

G

National | Published On Nov 12, 2026, 6.56 am IST

ASRB Recruitment | ఐకార్‌, క్రిషి విజ్ఞాన కేంద్రాల్లో ఉద్యోగాలు.. 1393 పోస్టుల‌తో ASRB నోటిఫికేష‌న్‌
Advertisement

ASRB Recruitment | త్రినేత్ర న్యూస్‌: కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ ప‌రిధిలోని అగ్రిక‌ల్చుర‌ల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ASRB) ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చుర‌ల్ రీసెర్చ్ (ICAR), క్రిషి విజ్ఞాన కేంద్రాల్లో (KVKs) ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 1393 టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, సీనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన వారి నుంచి ద‌ర‌ఖాస్తులు (ASRB Recruitment) ఆహ్వానిస్తున్న‌ది.

నవంబ‌ర్ 18 నుంచి ఆన్‌లైన్ అప్లికేష‌న్లు ప్రారంభ‌మ‌వుతాయి. డిసెంబ‌ర్ 17 వ‌ర‌కు అధికారిక వెబ్‌సైట్ asrb.gov.inలో అందుబాటులో ఉంటాయి. ఇందులో ఫీల్డ్ ఫామ్‌ టెక్నీషియ‌న్‌, ల్యాబొరేట‌ర్ టెక్నీషియ‌న్‌, వ‌ర్క్‌షాప్ స్టాఫ్‌, లైబ్ర‌రీ, ఇన్ఫ‌ర్మేష‌న్ సైన్స్‌, డాక్యుమెంటేష‌న్ స్టాఫ్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ వంటి పోస్టులు ఉన్నాయి. బీఈ, బీటెక్‌, డిప్లొమా, బీవీఎస్సీ, బీఎఫ్ఎస్సీ చేసిన‌వారు అర్హులు. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఎంపికైన‌వారికి ప్ర‌తినెల రూ.29,200 నుంచి రూ.1,12,400 వ‌ర‌కు జీతం వ‌స్తుంది.

మొత్తం ఖాళీలు: 1393

ఇందులో టెక్నిక‌ల్ అసిస్టెంట్ 1254 (జ‌న‌ర‌ల్ 558, ఓబీసీ 281, ఎస్సీ 164, ఎస్టీ 91, ఈడ‌బ్ల్యూఎస్ 160), సీనియ‌ర్ ఇందులో టెక్నిక‌ల్ అసిస్టెంట్ 139 (జ‌న‌ర‌ల్ 84, ఓబీసీ 25, ఎస్సీ 14, ఎస్టీ 6, ఈడ‌బ్ల్యూఎస్ 10) చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: అగ్రిక‌ల్చ‌ర్‌, హార్టిక‌ల్చ‌ర్‌లో డిగ్రీ, అగ్రిక‌ల్చుర‌ల్ ఇంజినీరింగ్‌, ఆగ్రో ఫారెస్ట్రీ, ఫుడ్‌సైన్స్‌, బ‌యోటెక్నాల‌జీ, ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌, బీవీఎస్సీ, బీఎఫ్ఎస్సీ, హోమ్ సైన్స్‌, బీఈ, బీటెక్‌, డిప్లొమా, బీఎల్ఐసీ, బీఎస్సీ కంప్యూట‌ర్స్‌, బీటెక్ కంప్యూట‌ర్స్‌, ఐటీ చేసి ఉండాలి. అభ్య‌ర్థులు 2026 డిసెంబ‌ర్ 17 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం

కంప్యూట‌ర్ ఆధారిత‌ రాత‌ప‌రీక్ష ఆధారంగా. ప్రాథ‌మిక సీబీటీ, మెయిన్స్ సీబీటీ.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష 100 మార్కుల‌కు ఉంటుంది. జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, జ‌న‌ర‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ నుంచి 25 మార్కులు, 25 ప్ర‌శ్న‌ల చొప్పున అడుగుతారు. గంట‌లో ప‌రీక్ష పూర్తి చేయాలి. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

మెయిన్స్ ఎగ్జామ్‌లో మొత్తం 100 ప్ర‌శ్న‌లు అడుగుతారు. 300 మార్కులు. మూడు గంటల్లో ప‌రీక్ష పూర్తిచేయాలి. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.

అప్లికేష‌న్ విధానం: ఆన్‌లైన్‌లో
ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్‌ రూ.300, రూ.600, ఈడ‌బ్ల్యూఎస్‌, ఓబీసీల‌కు రూ.150, రూ.300, ఇత‌రుల‌కు ఎలాంటి ఫీజు లేదు.
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: న‌వంబ‌ర్ 18 నుంచి
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: డిసెంబ‌ర్ 17
ప్రిలిమిన‌రీ సీబీటీ: 2027 ఫిబ్ర‌వ‌రిలో
అడ్మిట్ కార్డ్‌: సీబీటీకి వారం రోజుల ముందు విడుద‌ల
వెబ్‌సైట్‌: www.asrb.gov.in

నోటిఫికేష‌న్ పీడీఎఫ్‌: ASRB ICAR Recruitment 2026 
అధికారిక వెబ్‌సైట్‌: ASRB Recruitment 2026

Advertisement
Advertisement