Road Accident Accused | రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడు.. 16 ఏండ్ల తర్వాత అరెస్టు
Road Accident Accused | 16 ఏండ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతికి (Road Accident Accused) కారణమయ్యాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పక్క రాష్ట్రంలో తలదాచుకున్న అతడు ఇటీవలే స్వరాష్ట్రానికి వచ్చాడు.
Road Accident Accused | త్రినేత్ర న్యూస్: 16 ఏండ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతికి (Road Accident Accused) కారణమయ్యాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పక్క రాష్ట్రంలో తలదాచుకున్న అతడు ఇటీవలే స్వరాష్ట్రానికి వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో పారిపోయేందుకు ప్రయత్నించిన అతడిని 300 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన కేరళలోని (Kerala Police) అలప్పుజ జిల్లాలో చోటుచేసుకుంది.
2010లో సముద్ర తీరప్రాంత పట్టణమైన తుంబోలి (Thumboli) సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. పేరుమార్చుకున్న అతడు తప్పుడు చిరునామాతో గత 16 ఏండ్లుగా తమిళనాడులో (Tamil Nadu) తలదాచుకుంటున్నాడు. అయితే దీపావళి (Deepavali) సందర్భంగా ఇటీవల పట్టణకాడ్‌కు (Pattanakkad) వచ్చాడు. అతని రాక గురించి పోలీసులకు సమాచారం అందడంతో పట్టుకునేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న అతడు.. చంగనస్సేరి, తిరువల్ల, పాలా, ఎరట్టుపెట్ట, వాగమోన్, కుమిలి మీదుగా తిరిగి తమిళనాడుకు పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ఆయా పోలీస్టేషన్ల పరిధిలో తనిఖీ అయితే వెంబడించడంతో వాహనాలను తనిఖీ చేశారు. దీంతో నిందితుడు కొట్టాయం జిల్లాలోని వెచూర్-కల్లార రోడ్డు మీదుగా తప్పించుకుంటుండగా.. సుమారు 300 కిలోమీటర్ల మేర వెంబడించిన పోలీసులు ఎట్టకేలకు అతడు ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Abhishek Banerjee | కోల్కతాలో బుల్డోజర్.. అభిషేక్ బెనర్జీ ఇంటివద్ద కూల్చివేతలు
- ●SBI ATM | ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫలయత్నం.. అలారం మోగడంతో సీసీకెమెరాలు ఎత్తుకెల్లిన దుండగుడు
- ●Expired Liquor | గడువు ముగిసిన మద్యం తాగి.. ముగ్గురు స్నేహితులు మృతి
- ●Kondagattu | 60 ఏండ్ల తర్వాత అరుదైన వేడుక.. కొండగట్టులో ఈ నెల 16 నుంచి చందనోత్సవం..
- ●ASRB Recruitment | ఐకార్, కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఉద్యోగాలు.. 1393 పోస్టులతో ASRB నోటిఫికేషన్
- ●Horoscope | నవంబర్ 12 రాశి ఫలాలు.. నాయకత్వ లక్షణాలు, పోటీతత్వం పెరుగుతాయి!

Abhishek Banerjee | కోల్కతాలో బుల్డోజర్.. అభిషేక్ బెనర్జీ ఇంటివద్ద కూల్చివేతలు

SBI ATM | ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫలయత్నం.. అలారం మోగడంతో సీసీకెమెరాలు ఎత్తుకెల్లిన దుండగుడు

Expired Liquor | గడువు ముగిసిన మద్యం తాగి.. ముగ్గురు స్నేహితులు మృతి

Kondagattu | 60 ఏండ్ల తర్వాత అరుదైన వేడుక.. కొండగట్టులో ఈ నెల 16 నుంచి చందనోత్సవం..



