త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aldas Janaiah | వ్య‌వ‌సాయ వ‌ర్సిటీ వీసీపై లైంగిక ఆరోప‌ణ‌లు.. స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించిన గ‌వ‌ర్న‌ర్‌

Aldas Janaiah | ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) ఉప కుల‌ప‌తి అల్దాస్ జానయ్య (Aldas Janaiah)పై లైంగిక వేధింపుల ఆరోపణలపై (Harassment Allegations) స‌మ‌గ్ర విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ శివప్రతాప్ శుక్లా (Shivapratap Shukla) ఆదేశించారు.

G

Telangana | Published On Nov 12, 2026, 10.39 am IST

Aldas Janaiah | వ్య‌వ‌సాయ వ‌ర్సిటీ వీసీపై లైంగిక ఆరోప‌ణ‌లు.. స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించిన గ‌వ‌ర్న‌ర్‌
Advertisement

Aldas Janaiah | త్రినేత్ర న్యూస్‌: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) ఉప కుల‌ప‌తి అల్దాస్ జానయ్య (Aldas Janaiah)పై లైంగిక వేధింపుల ఆరోపణలపై (Harassment Allegations) స‌మ‌గ్ర విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ శివప్రతాప్ శుక్లా (Shivapratap Shukla) ఆదేశించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ కే.లక్ష్మీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఐఏఎస్ అధికారులు గోపి, రాహుల్ రాజ్, ‘ప్రజ్వల’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సునీతా కృష్ణన్ సభ్యులుగా ఉన్నారు. స‌మ‌గ్ర‌ విచారణ జరిపి 15 రోజుల్లోగా నివేదిక‌ అందజేయాలని, అలాగే బాధిత మహిళా ప్రొఫెసర్ భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వీసీ త‌న‌ను వేధించాడంటూ ఓ మ‌హిళా ప్రొఫెస‌ర్ ఇటీవ‌ల మీడియా వేదిక‌గా ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

నా వాట్సప్ చాట్స్, కాల్ హిస్టరీ తనిఖీ చేయండి..

గత కొన్ని రోజులుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి.. అసలు నిజాలను, దీని వెనుక ఉన్న కుట్ర కోణాలను బహిర్గతం చేయాలని కోరుతూ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు (DGP CV Anand) వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య లేఖ రాశారు. నవంబర్ 7న సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఓ మహిళా ఫ్యాకల్టీ (Women Professor) తనపై చేసిన నిరాధార ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్సిటీలో పారదర్శకత కోసం అమలు చేస్తున్న రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్‌ఫర్స్‌లో భాగంగా.. గత సెప్టెంబర్ 11న సదరు మహిళా అధ్యాపకురాలిని నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ 12 ఏండ్లుగా పనిచేస్తున్న మరో ఫ్యాకల్టీ స్థానంలో వర్సిటీ ట్రాన్స్‌ఫర్ పాలసీ ప్రకారమే ఈ బదిలీ జరిగింది. అయితే ఆ బదిలీ ఇష్టం లేకనే ఆమె కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వీసీ జానయ్య తన లేఖలో వివరించారు. గత రెండేండ్లుగా వర్సిటీలో తీసుకొస్తున్న సంస్కరణలు నచ్చని మరికొందరు అసంతృప్త వ్యక్తుల ప్రోద్బలంతో ఆమె ఈ కుట్రకు తెరలేపారని పేర్కొన్నారు.

11 నెలల మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి?

ఈ ఏడాది ప్రథమార్థంలో (జనవరి నుంచి జూన్ 2026 మధ్య) వేధింపులు జరిగాయని ఆమె ప్రెస్ మీట్‌లో ఆరోపించడాన్ని వీసీ ప్రశ్నించారు. నిజంగానే అలా జరిగి ఉంటే ఇన్నాళ్లూ కనీసం ఒక్క ఫిర్యాదు కూడా చేయకుండా 11 నెలల పాటు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. కేవలం బదిలీ జరిగిన తర్వాతే ప్రతీకారంతో ఈ కట్టుకథలు అల్లారని దీన్ని బట్టే స్పష్టమవుతోందని తెలిపారు. 35 ఏళ్ల తన సుదీర్ఘ వృత్తి జీవితంలో ఉపాధ్యాయుడిగా, పరిశోధకుడిగా, అడ్మినిస్ట్రేటర్‌గా మహిళా ఉద్యోగుల పట్ల ఎంతో గౌరవంతో వ్యవహరించానని, 64 ఏళ్ల వయసులో జీవితంలో తొలిసారి ఇటువంటి నిరాధార ఆరోపణలు ఎదుర్కోవడం తనను, తన కుటుంబాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.

తన వ్యక్తిగత ప్రతిష్టను, వీసీ పదవి గౌరవాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న ఈ వ్యవహారంపై తక్షణమే లోతైన విచారణ జరిపించాలని జానయ్య డీజీపీని కోరారు. సదరు మహిళా ఫ్యాకల్టీకి, తనకు మధ్య గత కొన్నేళ్లుగా లేదా కొన్ని నెలలుగా జరిగిన వాట్సప్ చాట్స్, కాల్ హిస్టరీతో పాటు అందుబాటులో ఉన్న అన్ని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆయన స్వయంగా విజ్ఞప్తి చేశారు. తద్వారా ఆమె ఆరోపణల్లోని డొల్లతనం బయటపడి అసలు నిజం వెలుగులోకి వస్తుందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement