త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stone Pelting Attack | కాంగ్రెస్‌ నేతల‌ బస్సుపై రాళ్ల దాడి.. ఎక్క‌డ జ‌రిగిందంటే!

Stone Pelting Attack | కామారెడ్డి (Kamareddy) జిల్లాలో కార్వాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మహమ్మద్ బిన్ అలీ, కాంగ్రెస్ నేత‌లు ప్రయాణిస్తున్న బస్సు(Bus)పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు రాళ్ల దాడి (Stone Pelting Attack) చేశారు.

S

Telangana | Published On Nov 5, 2026, 6.00 pm IST

Stone Pelting Attack | కాంగ్రెస్‌ నేతల‌ బస్సుపై రాళ్ల దాడి.. ఎక్క‌డ జ‌రిగిందంటే!
Advertisement

Stone Pelting Attack | త్రినేత్ర న్యూస్: కామారెడ్డి (Kamareddy) జిల్లాలో కార్వాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మహమ్మద్ బిన్ అలీ, కాంగ్రెస్ నేత‌లు ప్రయాణిస్తున్న బస్సు(Bus)పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు రాళ్ల దాడి (Stone Pelting Attack) చేశారు. జాతీయ రహదారి 44పై ఉన్న టెక్రియాల్ బ్రిడ్జి సమీపంలో బుధ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి.

పూర్తి విరాల్లోకి వెళ్తే.. ముహమ్మద్ బిన్ అలీ హజ్రి (Muhammad Bin Ali Hazri)తో పాటు సుమారు 30 మందికి పైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దిల్లీలో దేశ్ బచావో ర్యాలీలో పాల్గొని తిరిగి బ‌స్సులో తెలంగాణకు వ‌స్తున్నారు. బ‌స్సు అర్ధరాత్రి దాటిన తర్వాత కామారెడ్డి జిల్లా స‌మీపంలో నుంచి ప్ర‌యాణిస్తోంది. ఈ క్ర‌మంలో దుండగులు కదిలే బస్సుపైనే రెండు సార్లు రాళ్ల దాడి చేశారు. బస్సు అద్దాలు ధ్వంసమవ‌గా అదృష్టవశాత్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు.

కాగా ఈ ఘ‌ట‌న‌పై మహమ్మద్ బిన్ అలీ దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించేందుకు సమీపంలోని సీసీ టీవీ (CC TV) ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మ‌రోవైపు దాడి ఘ‌ట‌నను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. అనంత‌రం కామారెడ్డి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఘటనపై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement
Advertisement