త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemula Prashanth Reddy | జ‌ర‌గ‌కూడ‌ని ఘ‌ట‌న‌ల‌కు రాష్ట్రం వేదిక‌వుతోంది

Vemula Prashanth Reddy | జ‌ర‌గ‌కూడ‌ని సంఘ‌ట‌న‌ల‌కు రాష్ట్రం వేదిక‌వుతోంద‌ని.. పోలీసులు క‌నీస మాన‌వ‌త్వం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మాజీ మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి వాపోయారు.

S

Telangana | Published On Sep 22, 2026, 7.12 pm IST

Vemula Prashanth Reddy | జ‌ర‌గ‌కూడ‌ని ఘ‌ట‌న‌ల‌కు రాష్ట్రం వేదిక‌వుతోంది
Advertisement
  • విన‌య్‌భాస్క‌ర్‌పై పోలీసులు క‌నీస మాన‌వ‌త్వం లేకుండా ప్ర‌వ‌ర్తించారు
  • కాంగ్రెసోళ్లు అరాచ‌కాన్నే న‌మ్ముకున్న‌ట్లు క‌నిపిస్తోంది
  • మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు

Vemula Prashanth Reddy | త్రినేత్ర న్యూస్: జ‌ర‌గ‌కూడ‌ని సంఘ‌ట‌న‌ల‌కు రాష్ట్రం వేదిక‌వుతోంద‌ని.. పోలీసులు క‌నీస మాన‌వ‌త్వం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మాజీ మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి వాపోయారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం విన‌య్‌భాస్క‌ర్ రోగుల ప‌రామ‌ర్శ‌కు వెళ్తే రాజ‌కీయం చేస్తారా అని మండిప‌డ్డారు. కాంగ్రెసోళ్లు అరాచ‌కాన్నే న‌మ్ముకున్న‌ట్లు క‌నిపిస్తోంద‌న్నారు. ఈమేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న వరంగ‌ల్ ఎంజీఎం వ‌ద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌పై స్పందించారు. దాస్యంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు.

ప్రభుత్వం, పోలీసులు కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రతీ విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాన్నే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ఇబ్బందుల్లో ఉన్న రోగుల పరామర్శకు వెళ్తే త‌ప్పా. పోలీసులు వ్యవహరించిన తీరు అస్స‌లు బాలేదు. సీనియర్ ప్రజాప్రతినిధితో అలా వ్యవహరించకుండా ఉండాల్సింది. వేధింపులు, అరాచకాన్ని నమ్ముకుంటే ప్రజల మద్దతును శాశ్వతంగా కోల్పోతామన్న విషయాన్ని అటు ప్రభుత్వ పెద్దలు, ఇటు పోలీసులు గుర్తెరగాలి.

మొన్నటికి మొన్న అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడి చేశారు. నేతల ఇండ్లపైకి దాడులకు వెళ్లారు. ఇప్పుడు పరామర్శకు వెళ్తున్న వినయ్ భాస్కర్ పై దారుణంగా దాడిచేశారు. ప్రభుత్వ పెద్దలు, పోలీసులు భేషరతుగా క్షమాపణ చెప్పాలి. మా పార్టీ నేతలు, కార్యకర్తలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి అని ప్ర‌శాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement