Gutta Sukhendar Reddy | సిస్టర్ సిటీ బంధం ఇంకింత బలపడాలే
Gutta Sukhendar Reddy | హైదరాబాద్-జపాన్ (Japan)లోని మియోషి నగరాల మధ్య భాగస్వామ్యం ఇంకింత బలపడాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆకాంక్షించారు.
- హైదరాబాద్-మియోషి నగరాల భాగస్వామ్యానికి 20 ఏళ్లు నిండడం సంతోషకరం
- హైదరాబాద్-జపాన్ ఫెస్టివల్ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
Gutta Sukhendar Reddy |త్రినేత్ర న్యూస్: హైదరాబాద్-జపాన్ (Japan)లోని మియోషి నగరాల మధ్య భాగస్వామ్యం ఇంకింత బలపడాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సైబర్ గార్డెన్స్‌లో ఆదివారం హైదరాబాద్-జపాన్ ఫెస్టివల్-2026 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్-మియోషి నగరాల మధ్య సిస్టర్ సిటీ భాగస్వామ్యం ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు.
ప్రపంచ దేశాలకు ఆదర్శం..
భారతదేశం, జపాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలు ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడంతో పాటు విద్య, సాంకేతికత, పరిశ్రమలు, పర్యాటకం, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారానికి దోహదపడతాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, క్రమశిక్షణ, పారిశ్రామిక అభివృద్ధిలో జపాన్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్రం కూడా ఐటీ, ఫార్మా, పరిశ్రమలు, ఆవిష్కరణల రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోందని పేర్కొన్నారు. తెలంగాణ, జపాన్ మధ్య విద్యా, పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో మరిన్ని భాగస్వామ్యాలు ఏర్పడాలని ఆకాంక్షించారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన దేశాల మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
అంతకుముందు కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను గుత్తా సుఖేందర్ రెడ్డి తిలకించారు. జపాన్ సంస్కృతి, కళలు, సాంకేతికత, సంప్రదాయాలను ప్రతిబింబించే స్టాళ్లను కలియతిరిగారు. జపాన్ ప్రతినిధులతో ముచ్చటించి, ప్రదర్శనల విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జపాన్ కాన్సుల్ జనరల్ మునియో తకాహాషి, మియోషి నగర డిప్యూటీ మేయర్ తెరువో యమజాకి, జపాన్‌కు చెందిన ఇతర ప్రముఖ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Jupally Krishna Rao | ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించాలి
అక్టోబర్ 11, 2026

CM Revanth Reddy | ఎల్‌నినో ముప్పుపై అప్రమత్తం.. అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
అక్టోబర్ 10, 2026

Congress Party | 12న కాంగ్రెస్ మహా నిరసన.. ఢిల్లీకి రావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపు
అక్టోబర్ 10, 2026
తాజావార్తలు
- ●Supreme Court | ఢిల్లీలో ఇంటర్నెట్, మెట్రో సేవలను పునరుద్ధరించండి : సుప్రీంకోర్టు
- ●Ponnam Prabhakar | ఒక్క ఓటు పోలేదంటున్నవ్.. టైమిస్తే అందర్ని తోల్కొనొస్తా
- ●Talasani Srinivas Yadav | రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు.. ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి: మాజీ మంత్రి తలసాని
- ●Tahsildar Suspended | రైతుపై అనుచిత వ్యాఖ్యలు.. గజ్వేల్ తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు
- ●సెలవొచ్చింది.. సరదా పోయింది! సండేను టాస్క్‌గా మార్చేశామా?
- ●Suchitra-Medchal Flyover | నిలిచిన సుచిత్ర-మేడ్చల్ ఫ్లై ఓవర్ పనులు.. పిల్లర్లకు పిండ ప్రధానం

Supreme Court | ఢిల్లీలో ఇంటర్నెట్, మెట్రో సేవలను పునరుద్ధరించండి : సుప్రీంకోర్టు

Ponnam Prabhakar | ఒక్క ఓటు పోలేదంటున్నవ్.. టైమిస్తే అందర్ని తోల్కొనొస్తా

Talasani Srinivas Yadav | రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు.. ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి: మాజీ మంత్రి తలసాని

Tahsildar Suspended | రైతుపై అనుచిత వ్యాఖ్యలు.. గజ్వేల్ తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు





