RMP Doctor | వృద్ధుడికి ప్రాణం పోసిన ఆర్ఎంపీ డాక్టర్.. వీడియో
RMP Doctor | ఓ ఆర్ఎంపీ డాక్టర్ సమయస్ఫూర్తి ఓ వృద్ధుడి నిండు ప్రాణాలను కాపాడింది. గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిన వృద్ధుడికి ఆర్ఎంపీ డాక్టర్ సీపీఆర్ చేసి ఊపిరి పోశాడు.
RMP Doctor | త్రినేత్ర.న్యూస్ : ఓ ఆర్ఎంపీ డాక్టర్ సమయస్ఫూర్తి ఓ వృద్ధుడి నిండు ప్రాణాలను కాపాడింది. గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిన వృద్ధుడికి ఆర్ఎంపీ డాక్టర్ సీపీఆర్ చేసి ఊపిరి పోశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కాస్త స్పృహాలోకి వచ్చిన అనంతరం వృద్ధుడిని మెరుగైన చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వృద్ధుడు లక్ష్మయ్య(65) ప్రాణాలు కాపాడిన ఆర్ఎంపీ డాక్టర్ గోపాలకృష్ణ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆర్ఎంపీ డాక్టర్‌కు లక్ష్మయ్య కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నెటిజన్లు కూడా ఆర్ఎంపీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా మంది ఆర్ఎంపీ డాక్టర్లు తెలిసీ తెలియని వైద్యంతో రోగుల ప్రాణాలు తీస్తుంటారు. కానీ ఈ ఆర్ఎంపీ డాక్టర్ గోపాలకృష్ణ మాత్రం సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలను కాపాడడం గొప్ప విషయమని కితాబిస్తున్నారు.
ఖమ్మంలో సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన ఆర్ఎంపీ డాక్టర్
బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆదివారం గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిన పడగల లక్ష్మయ్య (65) అనే వృద్ధుడు
ఇది గమనించి సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి లక్ష్మయ్య ప్రాణాలు కాపాడిన ఆర్ఎంపీ డాక్టర్ గోపాలకృష్ణ pic.twitter.com/tuR7BuCywI
— Telugu Scribe (@TeluguScribe) December 22, 2025
సంబంధిత వార్తలు

MP Vaddiraju | బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు : ఎంపీ వద్దిరాజు
మే 20, 2026

Vaddiraju Ravi Chandra | ఖమ్మంలో 10 సీట్లు మావే.. ఇక్కడి మంత్రులకు దిమ్మ తిరగడం ఖాయం: ఎంపీ వద్దిరాజు
మే 15, 2026

Gene Therapy | కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇక మందులను వాడక్కర్లేదు.. జీన్ థెరపీతో సాధ్యం..
మే 3, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



