త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | దైవ ద‌ర్శ‌నానికి వెళ్లొస్తూ తిరిగిరాని లోకాల‌కు.. హైద‌రాబాద్‌కు చెందిన దంప‌తులు ఎలా చ‌నిపోయారంటే!

Road Accident | దైవ ద‌ర్శ‌నానికి వెళ్లి తిరిగి హైద‌రాబాద్‌కు వ‌స్తున్న దంప‌తుల‌(Married Couple)ను రోడ్డు ప్ర‌మాదం క‌బ‌ళించింది. కారు లారీని ఢీకొట్ట‌గా స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.

S

Telangana | Published On Nov 24, 2026, 12.59 pm IST

Road Accident | దైవ ద‌ర్శ‌నానికి వెళ్లొస్తూ తిరిగిరాని లోకాల‌కు.. హైద‌రాబాద్‌కు చెందిన దంప‌తులు ఎలా చ‌నిపోయారంటే!
Advertisement

Road Accident | త్రినేత్ర న్యూస్‌: దైవ ద‌ర్శ‌నానికి వెళ్లి తిరిగి హైద‌రాబాద్‌కు వ‌స్తున్న దంప‌తుల‌(Married Couple)ను రోడ్డు ప్ర‌మాదం క‌బ‌ళించింది. కారు లారీని ఢీకొట్ట‌గా స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ హృద‌య‌విదార‌క ఘ‌ట‌న ఖమ్మం (Khammam) జిల్లా వైరా సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన కోటా కిశోర్‌రెడ్డి (Kota Kishore Reddy), భార్య లావణ్య (Lavanya) , కుమారుడు ప్రణీత్ కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా ఏపీలోని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లారు. ద‌ర్శ‌నం అనంతరం హైదరాబాద్‌కు తిరిగిప‌య‌న‌మ‌య్యారు. మార్గ‌మ‌ధ్య‌లో వైరా సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద వీరు ప్ర‌యాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని బ‌లంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కిశోర్‌రెడ్డి, లావణ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ప్రణీత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని బాధితుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్ర‌మాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని ప‌రిశీలించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement