త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీకి వ‌చ్చేది సింగిల్ డిజిట్ సీట్లే: మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy | రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీకి వ‌చ్చేది సింగిల్ డిజిట్ సీట్లేన‌ని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు.

S

Telangana | Published On Nov 18, 2026, 3.23 pm IST

Ponguleti Srinivas Reddy | వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీకి వ‌చ్చేది సింగిల్ డిజిట్ సీట్లే: మంత్రి పొంగులేటి
Advertisement

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర న్యూస్: రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీకి వ‌చ్చేది సింగిల్ డిజిట్ సీట్లేన‌ని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. ప‌దేండ్ల‌లో దోచుకున్న సొమ్ముతో బీఆర్ఎస్ పార్టీ సోష‌ల్ మీడియ‌లో ప్ర‌భుత్వంపై విషం చిమ్ముతున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌జాప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన నూత‌న చేయూత పించ‌న్ల మంజూరు ప‌త్రాల‌ను ఖమ్మం జిల్లా దానవాయిగూడెంలో ఆయ‌న బుధ‌వారం పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌జా ప్ర‌భుత్వం పేద‌ల కోస‌మే ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో, ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement