త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

College Hostel | డిగ్రీ కాలేజీ హాస్టల్ బాత్రూంలో విద్యార్థిని ప్రసవం.. శిశువు మృతి

College Hostel | మహబూబాబాద్‌లోని ఓ మహిళా డిగ్రీ కాలేజీ హాస్ట‌ల్‌లో (College Hostel) విద్యార్థిని ప్ర‌స‌వించ‌డం, శిశువు మృతిచెందిన ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది. ఖమ్మం (Khammam) జిల్లాలోని ఓ మండలానికి చెందిన విద్యార్థిని (19) నాలుగు నెలల క్రితం మ‌హ‌బూబాబాద్ (Mahabubabad) జిల్లా కేంద్రంలోని ట్రైబ‌ల్ వెల్ఫేర్ మ‌హిళా డిగ్రీ కళాశాలలో (Degree College) ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో చేరింది.

G

Telangana | Published On Nov 26, 2026, 6.20 am IST

College Hostel | డిగ్రీ కాలేజీ హాస్టల్ బాత్రూంలో విద్యార్థిని ప్రసవం.. శిశువు మృతి
Advertisement

College Hostel | త్రినేత్ర న్యూస్‌: మహబూబాబాద్‌లోని ఓ మహిళా డిగ్రీ కాలేజీ హాస్ట‌ల్‌లో (College Hostel) విద్యార్థిని ప్ర‌స‌వించ‌డం, శిశువు మృతిచెందిన ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది. ఖమ్మం (Khammam) జిల్లాలోని ఓ మండలానికి చెందిన విద్యార్థిని (19) నాలుగు నెలల క్రితం మ‌హ‌బూబాబాద్ (Mahabubabad) జిల్లా కేంద్రంలోని ట్రైబ‌ల్ వెల్ఫేర్ మ‌హిళా డిగ్రీ కళాశాలలో (Degree College) ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో చేరింది. ప్ర‌స్తుతం కాలేజీ హాస్టల్‌లో ఉంటున్న‌ది. అప్పటికే గర్భం దాల్చిన ఆమె.. తోటి విద్యార్థినులు, అధ్యాపకులు, హాస్ట‌ల్ సిబ్బందికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంది. కాగా, బుధ‌వారం ఉద‌యం క‌డుపు నొప్పిగా ఉంద‌ని చెప్ప‌డంతో హాస్ట‌ల్ సిబ్బంది సాధార‌ణ మందులు ఇచ్చారు. అయితే ఆమె కొద్ది సేప‌టికే స్నానాల గ‌దిలో (Hostel Bathroom) ఓ బాబుకు జ‌న్మ‌నిచ్చింది. సుమారు 2.5 కిలోల బ‌రువుతో జ‌న్మించిన ఆ శిశువు కొద్దిసేప‌టికే మ‌ర‌ణించాడు. బాత్రూంలో మృత‌శిశువును చూసిన కొందరు విద్యార్థినులు ప్రిన్సిపల్‌కు సమాచారమిచ్చారు.

అప్పటికే ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని అధ్యాపకులు నిలదీయగా అందులో ఒక విద్యార్థిని తాను మగబిడ్డను ప్రసవించినట్లు చెప్పింది. ఆ శిశువు మృతి చెందినట్లు వెల్ల‌డించింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు, శిశు సంక్షేమాధికారులకు, పోలీసులకు స‌మాచారం అందించారు. అధికారులు, పోలీసులు కాలేజీకి చేరుకుని విద్యార్థినిని విచారించారు. బాధిత విద్యార్థిని నుంచి వాంగ్మూలం తీసుకుని జీరో ఎఫ్‌ఐఆర్ చేశారు. యువ‌తి ఇంటి సమీపంలో ఉండే ఒక యువకుడితో రెండేండ్ల‌ క్రితం (ఆమె మైనర్‌గా ఉన్నప్పుడు) ఏర్పడిన పరిచయం ప్రేమ‌గా మారింద‌ని, అత‌ని వల్లే గర్భం దాల్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీని ఆధారంగా పోలీసులు పోక్సో (POCSO) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థిని గర్భంతో ఉన్న విషయాన్ని వార్డెన్, కాలేజీ సిబ్బంది ఎలా గుర్తించలేకపోయారని విద్యార్థి సంఘాలు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల ప్రిన్సిపల్, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement
Advertisement