త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kirankumar Reddy | కేటీఆర్.. నువ్‌ జ‌ల ఉద్య‌మం చేయాల్సిన ప‌ని లేదు.. ప్ర‌జ‌లే నీకు జ‌ల స‌మాధి క‌డ‌త‌రు

Chamala Kirankumar Reddy | జ‌ల ఉద్య‌మం చేస్తామ‌ని కేటీఆర్ అంటున్నార‌ని.. తెలంగాణ ప్ర‌జ‌లు ఆల్రెడి బీఆర్ఎస్ పార్టీని జ‌ల స‌మాధి చేశార‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి కేటీఆర్‌కు కౌంట‌రిచ్చారు. ఏపీ ప్ర‌భుత్వం పెట్టిన జీఆర్ఎంబీ మీటింగ్‌కు వెళ్లి వారి ప్ర‌తిపాద‌న‌ల‌ను వ్య‌తిరేకించాలా వ‌ద్దా అని ప్ర‌శ్నించారు. రోజా ఇంట్లో కేసీఆర్ చేప‌ల పులుసు తిని రాయ‌ల‌సీమ‌ను ర‌త‌నాల సీమ చేస్తామ‌ని అన‌లేదా? అని నిల‌దీశారు.

S

Telangana | Published On Aug 9, 2026, 1.04 pm IST

Chamala Kirankumar Reddy | కేటీఆర్.. నువ్‌ జ‌ల ఉద్య‌మం చేయాల్సిన ప‌ని లేదు.. ప్ర‌జ‌లే నీకు జ‌ల స‌మాధి క‌డ‌త‌రు
Advertisement
  • బీఆర్ఎస్‌కు కాళేశ్వ‌రం మీదున్న ప్రేమ పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఎందుకు లేదు?
  • ఏపీ పెట్టిన మీటింగ్‌ల వారి ప్ర‌తిపాద‌న‌లను వ్య‌తిరేకించాలా వ‌ద్దా?
  • కేసీఆర్ రోజా ఇంట్లో చేప‌ల పుసులు తిని రాయ‌ల‌సీమ‌ను ర‌త‌నాల సీమ చేస్తామ‌ని అన‌లేదా?
  • కేటీఆర్‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన భువ‌నగిరి ఎంపీ చామల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి

Chamala Kirankumar Reddy | త్రినేత్ర‌.న్యూస్: జ‌ల ఉద్య‌మం చేస్తామ‌ని కేటీఆర్ అంటున్నార‌ని.. తెలంగాణ ప్ర‌జ‌లు ఆల్రెడి బీఆర్ఎస్ పార్టీని జ‌ల స‌మాధి చేశార‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి కేటీఆర్‌కు కౌంట‌రిచ్చారు. ఏపీ ప్ర‌భుత్వం పెట్టిన జీఆర్ఎంబీ మీటింగ్‌కు వెళ్లి వారి ప్ర‌తిపాద‌న‌ల‌ను వ్య‌తిరేకించాలా వ‌ద్దా అని ప్ర‌శ్నించారు. రోజా ఇంట్లో కేసీఆర్ చేప‌ల పులుసు తిని రాయ‌ల‌సీమ‌ను ర‌త‌నాల సీమ చేస్తామ‌ని అన‌లేదా? అని నిల‌దీశారు. కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబుతో అవగాహన ఉందని దుష్ప్రచారం చేసి ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టాలని చూస్తున్నార‌ని ఆరోపించారు. ఈమేర‌కు ఆయ‌న ఆదివారం ఎక్స్ వేదిక‌గా మాట్లాడారు.

ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్ కు వెళ్లి ఏపీ ప్రతిపాదనలను వ్యతిరేకించాలా వద్దా? కేసీఆర్ రాయలసీమ వెళ్లి రోజా ఇంట్లో చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తామని అనలేదా? జ‌గన్‌ను ప్రజా భవన్‌కు పిలిచి బిర్యానీ పెట్టి గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు అని చామ‌ల పేర్కొన్నారు.

ఆదాయం తెచ్చేందుకే హిల్ట్ పాల‌సీ..

ప్రభుత్వానికి ఆదాయం తేవాలనే నిర్ణయంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీ తెచ్చారు. కేటీఆర్ తన దగ్గర ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళతో హైడ్రాకు వ్యతిరేకంగా కోర్టులో కేసులో వేయిస్తున్నారు. కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. కృష్ణాలో తెలంగాణకు 299 టీఎంసీల వాటాను ఒప్పుకున్నది బీఆర్ఎస్ కాదా? కేటీఆర్ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం చేసినా దాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు అని ఎంపీ చామ‌ల‌ మండిప‌డ్డారు.

బీఆర్ఎస్ పిల్ల పార్టీ..

బీఆర్ఎస్ పదేళ్లల పాల‌న‌లో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. కేటీఆర్, హరీష్ రావు మాటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉంది. బీఆర్ఎస్ పార్టీ పిల్ల పార్టీ. ఎలక్షన్లు, కలెక్షన్ల కోసమే కేసీఆర్ పార్టీ పెట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం కాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారు. బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎందుకు లేదు? కేటీఆర్ పిచ్చి మాటలు బంద్ చేయాలి అని ఎంపీ చామ‌ల‌ కిర‌ణ్‌కుమార్‌రెడ్డి హెచ్చ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement