త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR Warns CM Revanth Reddy | మా ప్రభుత్వం రాగానే ఆ పాలసీని రద్దు చేస్తాం.. కేటీఆర్ సంచలన ప్రకటన

నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే మరో మహా ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. హైడ్రా కూల్చివేతలు, భూ స్కామ్‌పై మండిపడ్డారు.

J

Telangana | Published On Aug 8, 2026, 10.00 pm IST

KTR Warns CM Revanth Reddy | మా ప్రభుత్వం రాగానే ఆ పాలసీని రద్దు చేస్తాం.. కేటీఆర్ సంచలన ప్రకటన

సంక్షిప్త సారాంశం

జీఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడితే భారీ జల ఉద్యమం తప్పదని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైడ్రా (HYDRA) పేరుతో పేదల ఇళ్లను కూల్చి, ఆ భూములను పెద్దలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో హెచ్‌ఐఎల్‌టీ (HILT) పాలసీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రూ.5 లక్షల కోట్ల పారిశ్రామిక భూముల స్కామ్‌కు తెరలేపారని ఆరోపించారు. 22ఏ (22A) కింద లక్షలాది ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి కాంగ్రెస్ నేతలు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని విమర్శించారు.

Advertisement
  • జల దోపిడీకి కాంగ్రెస్ సర్కార్ సై
  • హైడ్రా, భూ స్కామ్‌లపై రేవంత్‌ను ఏకిపారేసిన కేటీఆర్

KTR Warns CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్‌గా సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణా, గోదావరి జలాల (GRMB) వివాదం, హైడ్రా (HYDRA) కూల్చివేతలు, హైదరాబాద్‌లో జరుగుతున్న భూ కుంభకోణాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

నదీ జలాల్లో అన్యాయం జరిగితే జల ఉద్యమమే

వచ్చే వారం జరగనున్న జీఆర్ఎంబీ (GRMB) మీటింగ్ ఎజెండాను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు అంగీకరించారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆ ఎజెండా పూర్తిగా తెలంగాణ హక్కులను కాలరాసేలా ఉందని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే రేవంత్ పనిచేస్తున్నారని, అందుకే తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అయిన ఆదిత్యనాథ్ దాస్‌ను సలహాదారుగా నియమించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అండతో నీటి వాటాల్లో అన్యాయం చేస్తే, మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మించిన మరో మహా 'జల ఆందోళన' తప్పదని హెచ్చరించారు.

హైడ్రా పేరుతో పేదలపై దాడి.. కోర్టు మొట్టికాయలు

హైడ్రా వ్యవహారంలో ప్రభుత్వాన్ని హైకోర్టు తీవ్రంగా మందలించిందని, ఇది ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గతంలో తాము ఈవీడీఎం (EVDM) వ్యవస్థను తీసుకువస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని హైడ్రాగా మార్చి నగరంలో విధ్వంసం సృష్టిస్తోందని మండిపడ్డారు. పేదల ఇళ్లను కూలగొట్టి, ఆ 2500 ఎకరాలను రియల్ ఎస్టేట్ పెద్దలకు అమ్ముకునేందుకే ఈ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని, రేవంత్ రెడ్డి అచ్చం హిట్లర్‌లా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.

5 లక్షల కోట్ల స్కామ్.. ఆ భూములెవరివి?

హైదరాబాద్‌లో 10 వేల ఎకరాల పారిశ్రామిక భూములకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రూ. 5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి (Scam) తెరలేపారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు పాత ధరలకే ఆస్తులు కట్టబెట్టేందుకే కొత్తగా HILT (హిల్ట్) పాలసీని తెచ్చారన్నారు. తాము మళ్లీ అధికారంలోకి రాగానే దీన్ని వెంటనే రద్దు చేస్తామని, పారిశ్రామికవేత్తలు ఎవరూ ప్రస్తుత పాలసీ కింద భూములను రెగ్యులరైజ్ (Regularize) చేసుకోవద్దని సూచించారు.

22A తో బ్లాక్‌మెయిల్.. తోడు దొంగల దందా

రాష్ట్రంలో ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు 22ఎ (22A) పేరుతో లక్షలాది మంది ప్రజల ఇండ్లు, స్థలాలను నిషేధిత జాబితాలో పెట్టి బ్లాక్‌మెయిల్ దందాకు దిగిందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌ఓసీ (NOC)లు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి తోడుదొంగల్లా ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక రాష్ట్రంలో విద్యుత్ కోతలపై స్పందిస్తూ.. రైతులకు 24 గంటల కరెంట్ (Power cuts) ఎక్కడ ఇస్తున్నారో సబ్-స్టేషన్ వద్దకు వచ్చి నిరూపించాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు.

Advertisement
Advertisement