Yash | నా భార్యకు థాంక్స్ – తన సపోర్ట్ వల్లే టాక్సిక్ చేయగలిగా – యశ్ కామెంట్స్
టాక్సిక్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో భార్య రాధికకు యశ్ థాంక్స్ చెప్పాడు. తను లేకుండా టాక్సిక్ చేయగలిగేవాడిని కాదని అన్నారు. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో టాక్సిక్ గురించి యశ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Aug 9, 2026, 11.03 am IST
Yash | యశ్ టాక్సిక్ ట్రైలర్ రికార్డ్ వ్యూస్‌తో అదరగొడుతోంది. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలలో ఈ ట్రైలర్ గురించే డిస్కషన్లు నడుస్తున్నాయి. టాక్సిక్ ట్రైలర్‌లోని విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రేమ, నమ్మకద్రోహం, మోసం లాంటి అంశాలతో ఎమోషనల్ అండ్ వయలెంట్‌గా ఈ సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా యశ్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. హీరోయిన్ల పాత్రలు డిఫరెంట్‌గా కనిపించాయి. టాక్సిక్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ బెంగళూరులో జరిగింది. ఈ వేడుకలో యశ్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్‌తో పాటు మిగిలిన హీరోయిన్లు టెక్నీషియన్లు అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్‌లో టాక్సిక్ జర్నీపై యశ్ ఆసక్తికర కామెంట్లు చేశాడు.
ఇండియన్ సినిమా...
ఇది నా సినిమా కాదు.. ఇది ఇండియన్ సినిమా. భారతీయ సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టాలనే సంకల్పంతో తెరకెక్కించాం. ఈ సినిమాను కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించాం. ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. టాక్సిక్ వెనుక వేలాది మంది హార్డ్ వర్క్ ఉంది. ప్రతి ఒక్కరూ ఎంతో ప్యాషన్‌తో పనిచేశారు. డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ ఈ సినిమా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఈ సినిమాను తెరకెక్కించారు. స్టార్స్ కాంబినేషన్‌లో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన సినిమా మామూలు విషయం కాదు.
200 రోజులు షూటింగ్...
దాదాపు 200 రోజుల పాటు రెండు భాషల్లో ఈ సినిమాను షూట్ చేశాం. ఇందులో పనిచేసిన స్టార్స్ అందరూ తమ సమయాన్ని ఈ సినిమా కోసం డెడికేట్ చేశారు. ఎంత రా అండ్ రస్టిక్‌గా ఉంటుందో కథ కూడా అంతే హానెస్ట్‌గా ఉంటుంది.
భార్యకు థాంక్స్...
నా భార్య రాధికకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. తన సపోర్ట్ లేకపోతే ఈ సినిమా చేయగలిగేవాడిని కాదు. ఇది చాలా హార్డ్ వర్క్‌తో కూడుకున్న సినిమా. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నటించా. ఇందులో రెండు, మూడు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తాను. వాటి తగ్గట్లుగా కనిపించడానికి చాలా సమయం అవసరమైంది. ఆ టైమ్‌లో నాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా అన్ని పనులు తనే చూసుకుంది. నాకు అండగా నిలిచింది.
లేడీ సూపర్ స్టార్....
లేడీస్ సూపర్‌స్టార్ నయనతార ఎంతో బిజీ. అయినప్పటికీ ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పనిచేశారు. మల్టీపుల్ షేడ్స్‌తో ఆమె పాత్ర సాగుతుంది. టాక్సిక్‌లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అందరి పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. కియారా సినిమాను చాలా బాగా అర్థం చేసుకుని నటించింది. కచ్చితంగా ఆమె పాత్రను ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. నేను ఇండియన్ సినిమాకు ఒక కార్మికుడిలా పనిచేస్తాను. నా బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను. ‘టాక్సిక్’ కచ్చితంగా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది అని యశ్ అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Toxic Trailer | అందమే ఆయుధం – టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ – కేజీఎఫ్‌తో కంపేరిజన్స్
ఆగస్టు 8, 2026

Toxic Trailer Launch | బెంగళూరులో ‘టాక్సిక్’ సందడి.. ఎయిర్‌ఫోర్ట్‌లో తళుక్కుమన్న తారలు..!
ఆగస్టు 8, 2026

Nayanthara | తన సినిమాతో తానే పోటీ – రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●POCSO Case | లెక్కలు చెబుతానంటే మైనర్ బాలికపై అఘాయిత్యం.. టీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్పై పోక్సో కేసు
- ●Hyderabad | ఘనంగా బోనాల జాతర.. అంబర్‌పేట అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క
- ●SIR | రేపటితో ముగియనున్న ఎస్ఐఆర్ గడువు.. ఇప్పటికీ తిరిగి రాని 74 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలు!
- ●Road Accident | ఐషర్ వాహనాన్ని ఢీకొని.. బ్రిడ్జిపై నుంచి కింద పడిన ట్రావెల్స్ బస్సు..
- ●Mahesh Babu | మహేశ్ బాబు బర్త్‌డే స్పెషల్.. అదిరిపోయే లుక్‌లో రుద్ర..
- ●Weekly Horoscope | ఈవారం రాశి ఫలాలు.. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి!

POCSO Case | లెక్కలు చెబుతానంటే మైనర్ బాలికపై అఘాయిత్యం.. టీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్పై పోక్సో కేసు

Hyderabad | ఘనంగా బోనాల జాతర.. అంబర్‌పేట అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క

SIR | రేపటితో ముగియనున్న ఎస్ఐఆర్ గడువు.. ఇప్పటికీ తిరిగి రాని 74 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలు!

Road Accident | ఐషర్ వాహనాన్ని ఢీకొని.. బ్రిడ్జిపై నుంచి కింద పడిన ట్రావెల్స్ బస్సు..



