త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arrive Alive Awareness Program | ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించండి.. డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయండి

Arrive Alive Awareness Program | ప్ర‌తి ఒక్క‌రు ట్రాఫిక్ సిగ్న‌ళ్ల‌ను పాటిస్తూ.. ఇండికేట‌ర్ల‌ను ఉప‌యోగిస్తూ డ్రైవింగ్ చేయాల‌ని ట్రాఫిక్‌ అడిషనల్ డీసీపీ సి.వేణుగోపాల్ రెడ్డి సూచించారు. ప్రమాదాలను ముందుగానే ఊహించి వాటిని నివారించే చురుకైన వ్యూహమే డిఫెన్సివ్ డ్రైవింగ్ అన్నారు. రోడ్డుపై మన భద్రతతో పాటు తోటి ప్రయాణికుల భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల‌ని చెప్పారు.

S

Hyderabad | Published On Aug 8, 2026, 7.23 pm IST

Arrive Alive Awareness Program | ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించండి.. డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయండి
Advertisement
  • మ‌న భ‌ద్ర‌త ఎంత ముఖ్య‌మో తోటి ప్ర‌యాణికుల భ‌ద్ర‌త అంతే ముఖ్యం
  • ప్ర‌మాద‌ బాధితుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తే రూ.25 వేలు అందుకోవ‌చ్చు
  • వాస‌వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ "అరైవ్ అలైవ్" స‌ద‌స్సులో ట్రాఫిక్‌ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి

Arrive Alive Awareness Program | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌తి ఒక్క‌రు ట్రాఫిక్ సిగ్న‌ళ్ల‌ను పాటిస్తూ.. ఇండికేట‌ర్ల‌ను ఉప‌యోగిస్తూ డ్రైవింగ్ చేయాల‌ని ట్రాఫిక్‌ అడిషనల్ డీసీపీ సి.వేణుగోపాల్ రెడ్డి సూచించారు. ప్రమాదాలను ముందుగానే ఊహించి వాటిని నివారించే చురుకైన వ్యూహమే డిఫెన్సివ్ డ్రైవింగ్ అన్నారు. రోడ్డుపై మన భద్రతతో పాటు తోటి ప్రయాణికుల భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల‌ని చెప్పారు. రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలు బాధితుడి ప్రాణాలను కాపాడటంలో చాలా కీలకమ‌ని వివ‌రించారు. శ‌నివారం ఇబ్రహీంబాగ్‌లోని వాసవీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులకు నిర్వ‌హించిన‌ "అరైవ్ అలైవ్" రోడ్డు భద్రతా అవగాహన సదస్సులో ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ట్రాఫిక్‌ జాయింట్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేర‌కు ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్లు పేర్కొన్నారు.

డ్రైవింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్ద‌ని సూచించారు. ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి సహాయం చేసే వ్యక్తులకు ప్రభుత్వం 'రాహ్-వీర్' పథకం కింద రూ.25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందిస్తుందన్నారు. బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (TTI) ఇన్‌స్పెక్టర్ నాగుల అశోక్, సిబ్బంది ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వ‌హించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.

అనంత‌రం ఇన్‌స్పెక్టర్ నాగుల అశోక్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో సీట్‌బెల్ట్ పెట్టుకోవాలన్నారు. పరిమితికి మించిన వేగాన్ని నివారించాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించడం, వాహనాల మధ్య సురక్షిత దూరం పాటించడం, ఇండికేటర్లను ఉపయోగించడం, రోడ్డు సంకేతాలను గమనించడం, వాహనాలను కండిషన్‌లో ఉంచుకోవడం వంటి ప్రాథమిక సూత్రాలను ఎప్ప‌టిక‌ప్పుడు చూసుకోవాల‌న్నారు.

ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.వి. రమణ, H&SS విభాగాధిపతి డాక్టర్ జి.మీనా, TTI సిబ్బంది కృష్ణ, 800 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement