Nayanthara | టాక్సిక్ కోసం పదేళ్ల రూల్ బ్రేక్ – నయనతారను ట్రోల్ చేస్తున్న కోలీవుడ్ ఫ్యాన్స్
నయనతార సినిమా ప్రమోషన్స్‌లో కనిపించి పదేళ్లు దాటిపోయింది. ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేసినా ప్రమోషనల్ ఈవెంట్లకు నయన్ మాత్రం అటెండ్ కాదు. యశ్ టాక్సిక్ కోసం ఫస్ట్ టైమ్ నో ప్రమోషన్స్ పాలసీని బ్రేక్ చేసింది. శనివారం బెంగళూరులో జరిగిన టాక్సిక్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు అటెండ్ అయ్యింది. అయితే ఈ వేడుకలో పాల్గొనడంపై లేడీ సూపర్ స్టార్‌ను కోలీవుడ్ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.
Entertainment | Published On Aug 9, 2026, 12.36 pm IST
Nayanthara | సాధారణంగా సినిమా షూటింగ్‌తో పాటు ప్రమోషన్లలో పాల్గొనడం కూడా తమ బాధ్యతగానే హీరోహీరోయిన్లు భావిస్తుంటారు. రెండింటికి కలిపే రెమ్యూనరేషన్లు తీసుకుంటారు. నయనతార విషయంలో మాత్రం ఈ రూల్ వర్తించదు. సినిమా షూటింగ్‌లో పాల్గొనడంతోనే ఆమె వర్క్ కంప్లీట్ అవుతోంది. ప్రమోషన్లకు హాజరు కాదు. చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసినా నో ప్రమోషన్స్ పాలసీ విషయంలో నయన్ స్క్రిక్ట్‌గా ఉంటూ వచ్చింది. గత పదేళ్లకుపైగా ఇదే రూల్‌ను పాటిస్తోంది. ఈవెంట్లలో హీరోహీరోయిన్ల మధ్య చూపించే వివక్ష, కథానాయికలకు సరైన గౌరవం ఇవ్వకపోవడం, వ్యక్తిగత లైఫ్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్లే తాను ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో నయనతార చెప్పింది.
టాక్సిక్ తో బ్రేక్...
ఫస్ట్ టైమ్ నో ప్రమోషన్స్ పాలసీని యశ్ టాక్సిక్ కోసం పక్కనపెట్టింది నయనతార. శనివారం బెంగళూరులో జరిగిన టాక్సిక్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో పాల్గొన్నది. ఈ వేడుకకు అటెండ్ అయినందుకు తనపై ట్రోల్స్ వస్తాయని ముందే ఊహించింది. తాను ప్రమోషనల్ ఈవెంట్లకు ఎందుకు దూరంగా ఉంటున్నానో ఈ వేడుకలో చెప్పింది. "సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరుకావడం నాకు ఇష్టం ఉండదని చాలా మంది అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. ఈవెంట్లలో సమయస్ఫూర్తిగా మాట్లాడాలి. వాటిని సక్సెస్‌ఫుల్‌గా చేయడానికి ఎంతో స్కిల్ కావాలి. ఆ నైపుణ్యం నాలో లేదని అనుకుంటున్నా. అందుకే ప్రమోషనల్ ఈవెంట్లకు దూరంగా ఉంటున్నా. టాక్సిక్ ట్రైలర్ లాంఛ్‌కు కూడా అటెండ్ కాకూడదని అనుకున్నా. కానీ యశ్ ఫోన్ కాల్‌తో హాజరుకావాల్సివచ్చింది" అంటూ చెప్పింది.
ఫ్యాన్స్ ట్రోల్
టాక్సిక్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు నయనతార హాజరుకావడంపై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ఫ్యాన్స్ లేడీ సూపర్ స్టార్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. రెమ్యూనరేషన్ ఎక్కువగా తీసుకొని నయన్ ఈ ఈవెంట్‌కు అటెండ్ అయ్యుంటుందని అంటున్నారు. అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన కోలీవుడ్, టాలీవుడ్‌ను విస్మరిస్తూ...కన్నడ, హిందీ భాషల ఈవెంట్లకు మాత్రం నయన్ హాజరవుతుందని, తమిళ సినిమాలపై ఆమెకు ఉన్న చిన్నచూపుకు ఇదే నిదర్శనమని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వారి ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి.
టాక్సిక్ సినిమాలో నయనతార గంగ అనే పాత్రలో కనిపించబోతుంది. యశ్ సోదరిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో నయనతార నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Yash | నా భార్యకు థాంక్స్ – తన సపోర్ట్ వల్లే టాక్సిక్ చేయగలిగా – యశ్ కామెంట్స్
ఆగస్టు 9, 2026

Toxic Trailer | అందమే ఆయుధం – టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ – కేజీఎఫ్‌తో కంపేరిజన్స్
ఆగస్టు 8, 2026

Toxic Trailer Launch | బెంగళూరులో ‘టాక్సిక్’ సందడి.. ఎయిర్‌ఫోర్ట్‌లో తళుక్కుమన్న తారలు..!
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●Vijay Deverakonda | బోనాల వేడుక - లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో విజయ్ దేవరకొండ, సందీప్ వంగా ప్రత్యేక పూజలు
- ●Cyber Crime | సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు తొందరగా న్యాయం అందించాలి: అదనపు సీపీ ఎం.శ్రీనివాస్
- ●Mahesh Goud | క్విట్ ఇండియా ఉద్యమం గురించి యువతరం తెలుసుకోవాలి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- ●Yash | నా భార్యకు థాంక్స్ - తన సపోర్ట్ వల్లే టాక్సిక్ చేయగలిగా - యశ్ కామెంట్స్
- ●POCSO Case | లెక్కలు చెబుతానంటే మైనర్ బాలికపై అఘాయిత్యం.. టీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్పై పోక్సో కేసు
- ●Hyderabad | ఘనంగా బోనాల జాతర.. అంబర్‌పేట అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క

Vijay Deverakonda | బోనాల వేడుక - లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో విజయ్ దేవరకొండ, సందీప్ వంగా ప్రత్యేక పూజలు

Cyber Crime | సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు తొందరగా న్యాయం అందించాలి: అదనపు సీపీ ఎం.శ్రీనివాస్

Mahesh Goud | క్విట్ ఇండియా ఉద్యమం గురించి యువతరం తెలుసుకోవాలి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

Yash | నా భార్యకు థాంక్స్ - తన సపోర్ట్ వల్లే టాక్సిక్ చేయగలిగా - యశ్ కామెంట్స్



