త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Goud | క్విట్ ఇండియా ఉద్య‌మం గురించి యువ‌త‌రం తెలుసుకోవాలి: పీసీసీ చీఫ్ మహేశ్‌ గౌడ్

Mahesh Goud | క్విట్ ఇండియా ఉద్య‌మం గొప్ప‌త‌నం గురించి నేటి యువ‌త తెలుసుకోవాల‌ని పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్ (Mahesh Goud) అన్నారు. స్వాతంత్య్ర స‌మ‌యంలో క్విట్ ఇండియా ఉద్యమం (Quit India Movement) ప్రధాన పాత్ర పోషించింద‌ని చెప్పారు.

G

Telangana | Published On Aug 9, 2026, 11.19 am IST

Mahesh Goud | క్విట్ ఇండియా ఉద్య‌మం గురించి యువ‌త‌రం తెలుసుకోవాలి: పీసీసీ చీఫ్ మహేశ్‌ గౌడ్
Advertisement

Mahesh Goud | త్రినేత్ర‌.న్యూస్‌: క్విట్ ఇండియా ఉద్య‌మం గొప్ప‌త‌నం గురించి నేటి యువ‌త తెలుసుకోవాల‌ని పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్ (Mahesh Goud) అన్నారు. స్వాతంత్య్ర స‌మ‌యంలో క్విట్ ఇండియా ఉద్యమం (Quit India Movement) ప్రధాన పాత్ర పోషించింద‌ని చెప్పారు. ఆగస్టు 8న మ‌హాత్మా గాంధీ (Mahathma Gandhi) ఇచ్చిన పిలుపుతో యావత్ దేశం కదం తొక్కిందని వెల్ల‌డించారు. గాంధీ మహాత్ముడు, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ క్విట్ ఇండియా ఉద్యమానికి స్ఫూర్తి అని చెప్పారు. క్విట్ ఇండియా డే సంద‌ర్భంగా గాంధీభ‌వ‌న్‌లో జాతీయ జెండాను మ‌హేశ్ గౌడ్ ఎగురవేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, వాకిటి శ్రీహ‌రి పాల్గొన్నారు. అనంత‌రం మ‌హేశ్ గౌడ్ మాట్లాడుతూ.. బ్రిటీష్ వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం క్విట్ ఇండియా ఉద్య‌మ‌మేన‌న్నారు. Quit India Movement, , BJP,

వారికి క్విట్ చెప్పాలి..

ఇటీవ‌ల కేంద్రం మొండి వైఖరికి వ్యతిరేకంగా జ‌రిగింది జెన్ జీ (Gen Z Movement) ఉద్యమం. జెన్ జీ ఉద్యమ వీరులు క్విట్ ఇండియా ఉద్యమం గురించి తెలుసుకోవాల‌న్నారు. వేలాది మంది సర్వం కోల్పోయి ప్రాణత్యాగాలు చేస్తే స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. గాంధీ, నెహ్రూను మరిపించే ప్రయత్నం జరుగుతున్న‌ద‌ని వెల్ల‌డించారు. సర్దార్ పటేల్‌ను బీజేపీ (BJP) సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్న‌ద‌ని, రాజ్యాంగానికి తూట్లు పొడిచే వారికి క్విట్ చెప్పాల్సిన అవసరం ఉంద‌న్నారు. ప్రజాస్వామ్యంలో ఎంతటి వారైనా మెడలు వంచక తప్పదని స్ప‌ష్టం చేశారు. స్వాతంత్య్రం రావడానికి కారణాలను యువత అధ్యయనం చేయాల‌న్నారు.

బీఆర్ఎస్ ఉద్ధరించింది ఏమి లేదు..

దేశం ఆశ్చర్య‌ పోయేలా రాష్ట్రంలో అభివృధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయ‌ని చెప్పారు. గ‌త పదేండ్ల‌లో బీఆర్ఎస్ (BRS) ఉద్ధరించింది ఏమి లేద‌ని విమ‌ర్శించారు. ఉద్యోగాల‌ విషయంలో బీఆర్ఎస్ నేతల ప్రగల్భాలు హాస్యాస్పదమ‌ని ఎద్దేవా చేశారు. సద్విమర్శ చేయాలేకాని, అసత్యాలు మాట్లాడకూడ‌దంటూ బీఆర్ఎస్ నేత‌ల‌ను చుర‌క‌లంటించారు. అభివృధి, సంక్షేమం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువస్తాయ‌ని చెప్పారు. కార్యకర్తల కష్టాన్ని మరిచిపోమ‌ని తెలిపారు. సర్ ప్రక్రియలో ఓట్లు తొలగించే కార్యక్రమం జరుగుతున్న‌ద‌ని వెల్ల‌డించారు. ఓట్ల తొలగింపు అడ్డుకొని అర్హత కలిగిన ఓటును కాపాడుతున్నామ‌ని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కుల వివక్ష లేకుండా పోరాటం చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement