త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyber Crime | సైబ‌ర్ క్రైమ్ కేసుల్లో బాధితుల‌కు తొంద‌రగా న్యాయం అందించాలి: అదనపు సీపీ ఎం.శ్రీనివాస్‌

Cyber Crime | భారీ సైబ‌ర్ మోసాల కేసుల‌ను (Cyber Crime) వేగంగా ద‌ర్యాప్తు పూర్తిచేసి బాధితుల‌కు వీలైనంత తొంద‌ర‌గా న్యాయం అందించాల‌ని హైదరాబాద్ సిటీ క్రైమ్ అండ్ సిట్ (SIT) అదనపు పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ (Additional CP M.Srinivas) అన్నారు.

G

Hyderabad | Published On Aug 9, 2026, 11.50 am IST

Cyber Crime | సైబ‌ర్ క్రైమ్ కేసుల్లో బాధితుల‌కు తొంద‌రగా న్యాయం అందించాలి: అదనపు సీపీ ఎం.శ్రీనివాస్‌
Advertisement

Cyber Crime | త్రినేత్ర‌.న్యూస్‌: భారీ సైబ‌ర్ మోసాల కేసుల‌ను (Cyber Crime) వేగంగా ద‌ర్యాప్తు పూర్తిచేసి బాధితుల‌కు వీలైనంత తొంద‌ర‌గా న్యాయం అందించాల‌ని హైదరాబాద్ సిటీ క్రైమ్ అండ్ సిట్ (SIT) అదనపు పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ (Additional CP M.Srinivas) అన్నారు. ఏఐ ఆధారిత స్కామ్‌లు, ఇత‌ర కొత్త ర‌కాల సైబ‌ర్ నేరాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. వార్షిక త‌నిఖీల్లో భాగంగా హైద‌రాబాద్ సైబర్ క్రైమ్స్ యూనిట్‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా సైబర్ క్రైమ్స్ యూనిట్ పనితీరు, పెండింగ్ కేసుల స్థితి, డిజిటల్ ఫోరెన్సిక్ విభాగం, 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ స్పందన, సిబ్బంది కేటాయింపుపై సమీక్ష నిర్వహించారు. సైబర్ నేరాల నియంత్రణ, వేగంగా దర్యాప్తు చేయడానికి సైబర్ క్రైమ్స్ ఏసీపీ, ఎస్‌హెచ్‌ఓ, దర్యాప్తు అధికారులకు ప‌లు అంశాల‌పై నిర్దిష్ట లక్ష్యాలను జారీ చేశారు.

వేగవంతమైన దర్యాప్తు: రూ.లక్షల్లో నష్టం కలిగించిన భారీ సైబర్ మోసాల కేసులలో దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు త్వరగా న్యాయం అందించాలి.

సాక్ష్యాధారాల సేకరణ, నమోదు: కేసుల నిరూపణ శాతాన్ని పెంచడానికి డిజిటల్ సాక్ష్యాధారాల సేకరణ, చట్టపరమైన డాక్యుమెంటేషన్‌ను మరింత బలోపేతం చేయాలి.

బ్యాంకులతో సమన్వయం: బాధితుల నుంచి దోచుకున్న నిధులను వెంటనే ఫ్రీజ్ చేయడం మరియు తిరిగి రాబట్టడం (Recovery) కోసం బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలతో సమన్వయాన్ని మరింత పటిష్టం చేయాలి.

కొత్త రకం మోసాలపై అవగాహన: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్కామ్‌లు, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు, ఇతర కొత్త రకాల సైబర్ నేరాల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

పెండింగ్ కేసుల పరిష్కారం: పెండింగ్‌లో ఉన్న కేసులను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత వ్యవధిలో వాటిని వేగంగా పరిష్కరించాలి.

సైబర్ నేరాల నివారణకు తక్షణ దర్యాప్తు, పోగొట్టుకున్న సొమ్మును త్వరగా రాబట్టడం, పక్కాగా డిజిటల్ సాక్ష్యాలను నమోదు చేయడం, ప్రజలను చైతన్యపరచడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement