POCSO Case | లెక్కలు చెబుతానంటే మైనర్ బాలికపై అఘాయిత్యం.. టీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌పై పోక్సో కేసు
POCSO Case | మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన (TRS) నాయకుడిపై పోలీసులు పోక్సో కేసు (POCSO Case) నమోదుచేశారు.
POCSO Case | త్రినేత్ర.న్యూస్: మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన (TRS) నాయకుడిపై పోలీసులు పోక్సో కేసు (POCSO Case) నమోదుచేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ గౌరవరపు జగదీశ్ అలియాస్ డేవిడ్‌రాజ్.. శనివారం సాయంత్రం మద్యం మత్తులో 11 ఏండ్ల బాలిక ఇంటికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న ఆమెకు గణితం చెబుతానంటూ దారుణానికి ఒడిగట్టాడు. సాయంత్రం కూలిపనుల నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులకు తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఆ బాలిక చెప్పింది.
దీంతో వారు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ పుష్పాల రామారావు నిందితుడు డేవిడ్‌రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆయనపై పోక్సో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడిపై గతంలోనే రౌడీషీట్ నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
కవిత సోషల్ మీడియా సెల్‌లో వేధింపులు..!
టీఆర్ఎస్ చీఫ్ కవిత సోషల్ మీడియా సోషల్ మీడియా సెల్‌లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోకుండా.. ఫిర్యాదు చేసిన వారిపైనే క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం అంతర్గత విభేదాలు, వ్యక్తిగత ఆధిపత్య పోరే కారణమని ఓ యువతి పెట్టిన పోస్ట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వ్యవహారంపై కవిత గానీ, ఆమె సోషల్ మీడియా టీమ్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Danam Nagender | ఖైరతాబాద్‌లో పోటీపై సీఎం రేవంత్ స్పష్టత ఇస్తారు : దానం నాగేందర్
- ●Microsoft Surface | స్నాప్‌డ్రాగన్ ఎక్స్2 ప్లస్‌తో కొత్త మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ పీసీలు.. ధర ఎంతంటే?
- ●Palla Rajeshwar Reddy | 52 వేల కోట్ల బాకీ కట్టు.. రైతులకు కరెంటు ఇవ్వు
- ●Teen Harassed By Group Of Men | బీహార్‌లో మరో దారుణం.. నడిరోడ్డుపై యువతిని చుట్టుముట్టి
- ●BRS Protest at Yadadri Power Station | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ ధర్నా... పోలీసులకు, నేతల మధ్య వాగ్వాదం
- ●PB Fintech | ఐఆర్డీఏఐ చర్యల ఎఫెక్ట్.. పాలసీబజార్‌కు భారీ షాక్.. 28 శాతం పతనమైన షేర్..

Danam Nagender | ఖైరతాబాద్‌లో పోటీపై సీఎం రేవంత్ స్పష్టత ఇస్తారు : దానం నాగేందర్

Microsoft Surface | స్నాప్‌డ్రాగన్ ఎక్స్2 ప్లస్‌తో కొత్త మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ పీసీలు.. ధర ఎంతంటే?

Palla Rajeshwar Reddy | 52 వేల కోట్ల బాకీ కట్టు.. రైతులకు కరెంటు ఇవ్వు

Teen Harassed By Group Of Men | బీహార్‌లో మరో దారుణం.. నడిరోడ్డుపై యువతిని చుట్టుముట్టి






