SIR | రేపటితో ముగియనున్న ఎస్‌ఐఆర్ గడువు.. ఇప్పటికీ తిరిగి రాని 74 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలు!
SIR | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా (SIR) గడువు సోమవారంతో ముగియనుంది. ఇప్పటికీ సుమారు 20 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదని ఎలక్షన్ కమిషన్ (Election Commission) వెల్లడించింది. ఓటర్లు వివరాలు నింపి ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారాలను (Enumeration Form) ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ చేస్తున్నారు. ప్రస్తుత జాబితా ప్రకారం రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా 2,64,11,118 మంది ఎన్యూమరేషన్ ఫారాలు డిజటలైజేషన్ పూర్తయ్యాయి. గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వని వారు వెంటనే సమర్పించాలని ఎన్నికల అధికారులు కోరారు. ఈ ఫారాలు తిరిగి ఇచ్చిన ఓటర్ల పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో ఉంటాయని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వని 74 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇందులో ఒక్క హైదరాబాద్ క్యూర్ పరిధిలోనే 40 శాతం ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 శాతం ఓట్లు తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీరిలో మరణించినవారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారితో పాటు డూప్లికేట్ ఓట్లు సుమారు 60 లక్షల వరకు గుర్తించారు. ఈనెల 17న ఓటర్ల ముసాయిదా జాబితాను (Voter List) ఈసీ ప్రకటించనుంది. సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. నోటీసులు, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ ఈనెల 17 నుంచి అక్టోబర్ 15 వరకు ఉంటుంది. అక్టోబరు 19న తుది జాబితాను విడుదల చేస్తారు.

ఓట్లు గల్లంతయ్యేది ఈ జిల్లాల్లోనే..
సర్ ఫారాలను ఇంకా సమర్పించకపోవడంతో పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంగా హైదరాబాద్‌లో (Hyderabad) 58.41శాతం, మేడ్చల్‌లో 63.79 శాతం, రంగారెడ్డిలో 64.82 శాతం ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలను నింపి వెనక్కి ఇచ్చారు. హైదరాబాద్ జిల్లాలో 47,36,669 మంది ఓటర్లు ఉండగా 27,66,767 మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వగా, మేడ్చల్‌లో 29,79,130 ఓటర్లకుగాను 19 లక్షల వరకే ఎన్యూమరేషన్ ఫారాలు వెనక్కి వచ్చాయి. ఇక రంగారెడ్డిలో 36,99,743 మంది ఓటర్లు ఉండగా 23,98,99 మంది తిరిగి ఇచ్చారు. అంటే హైదరాబాద్‌లో 19 లక్షలు, రంగారెడ్డిలో 13 లక్షలు, మేడ్చల్‌లో 10 లక్షలకు పైగా ఓట్లు తగ్గిపోనున్నాయి.
తాజావార్తలు
- ●Road Accident | ఐషర్ వాహనాన్ని ఢీకొని.. బ్రిడ్జిపై నుంచి కింద పడిన ట్రావెల్స్ బస్సు..
- ●Mahesh Babu | మహేశ్ బాబు బర్త్డే స్పెషల్.. అదిరిపోయే లుక్లో రుద్ర..
- ●Weekly Horoscope | ఈవారం రాశి ఫలాలు.. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి!
- ●Traffic Restrictions | హైదరాబాద్‌లో బోనాలు.. ఈ రూట్లలో వెళ్లారో ఇక అంతే..!
- ●Horoscope | ఆగస్టు 9 రాశి ఫలాలు.. ఈ రాశివారిని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి!
- ●Theyyullathil Sree Kuttichathan Temple | భక్తుల కోరికలు తీర్చే కేరళ 'కుట్టిచాతన్' స్వామి.. ఇక్కడ దేవుడికి మద్యం, మాంసమే నైవేద్యం!

Road Accident | ఐషర్ వాహనాన్ని ఢీకొని.. బ్రిడ్జిపై నుంచి కింద పడిన ట్రావెల్స్ బస్సు..

Mahesh Babu | మహేశ్ బాబు బర్త్డే స్పెషల్.. అదిరిపోయే లుక్లో రుద్ర..

Weekly Horoscope | ఈవారం రాశి ఫలాలు.. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి!

Traffic Restrictions | హైదరాబాద్‌లో బోనాలు.. ఈ రూట్లలో వెళ్లారో ఇక అంతే..!




