Vijay Deverakonda | బోనాల వేడుక – లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో విజయ్ దేవరకొండ, సందీప్ వంగా ప్రత్యేక పూజలు
బోనాల వేడుక సందర్భంగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ వంగా లాల్ దర్వాజాలోని చారిత్రక మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అందరి కోరికలు నెరవేరాలని అమ్మవారికి మొక్కుకున్నానని విజయ్ దేవరకొండ అన్నారు.
Entertainment | Published On Aug 9, 2026, 11.57 am IST
బోనాల పండుగను పురస్కరించుకొని చారిత్రక లాల్ దర్వాజా మహంకాళి ఆలయాన్ని టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ వంగా సందర్శించారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విజయ్ దేవరకొండ, సందీప్ వంగాలకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. వీరిని చూసేందుకు అభిమానులు పోటీపడటంతో ఆలయ పరిసరాలు జన సందోహంతో కిక్కిరిసిపోయాయి.
అందరి కోరికలు తీరాలి...
"అందరి కోరికలు తీరాలని మొక్కుకున్నా. అలాగే నా కోరికలు కూడా నెరవేరాలని పూజలు చేశా. లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది" అని విజయ్ దేవరకొండ అన్నారు. సందీప్ వంగా తన నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ పేరు మీద ప్రత్యేక పూజలు చేయించారు.
రణబాలి...రౌడీ జనార్ధన
ప్రస్తుతం విజయ్ దేవరకొండ రణబాలితో పాటు రౌడీ జనార్ధన సినిమాల్లో నటిస్తున్నాడు. రణబాలిలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా అతడి భార్య రష్మిక మందన్న నటిస్తోంది. ఇటీవల మైసా సెట్స్‌లో రష్మిక గాయపడటంతో రణబాలి షూటింగ్‌కు బ్రేక్ పడింది. మరోవైపు సందీప్ వంగా స్పిరిట్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Cyber Crime | సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు తొందరగా న్యాయం అందించాలి: అదనపు సీపీ ఎం.శ్రీనివాస్
ఆగస్టు 9, 2026

Hyderabad | ఘనంగా బోనాల జాతర.. అంబర్‌పేట అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క
ఆగస్టు 9, 2026

SIR | రేపటితో ముగియనున్న ఎస్ఐఆర్ గడువు.. ఇప్పటికీ తిరిగి రాని 74 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలు!
ఆగస్టు 9, 2026
తాజావార్తలు
- ●Cyber Crime | సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు తొందరగా న్యాయం అందించాలి: అదనపు సీపీ ఎం.శ్రీనివాస్
- ●Mahesh Goud | క్విట్ ఇండియా ఉద్యమం గురించి యువతరం తెలుసుకోవాలి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- ●Yash | నా భార్యకు థాంక్స్ - తన సపోర్ట్ వల్లే టాక్సిక్ చేయగలిగా - యశ్ కామెంట్స్
- ●POCSO Case | లెక్కలు చెబుతానంటే మైనర్ బాలికపై అఘాయిత్యం.. టీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్పై పోక్సో కేసు
- ●Hyderabad | ఘనంగా బోనాల జాతర.. అంబర్‌పేట అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క
- ●SIR | రేపటితో ముగియనున్న ఎస్ఐఆర్ గడువు.. ఇప్పటికీ తిరిగి రాని 74 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలు!

Cyber Crime | సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు తొందరగా న్యాయం అందించాలి: అదనపు సీపీ ఎం.శ్రీనివాస్

Mahesh Goud | క్విట్ ఇండియా ఉద్యమం గురించి యువతరం తెలుసుకోవాలి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

Yash | నా భార్యకు థాంక్స్ - తన సపోర్ట్ వల్లే టాక్సిక్ చేయగలిగా - యశ్ కామెంట్స్

POCSO Case | లెక్కలు చెబుతానంటే మైనర్ బాలికపై అఘాయిత్యం.. టీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్పై పోక్సో కేసు



