Ramchandar Rao | పేదలకు వచ్చేది 7 వేల ఇండ్లే.. అది క్యూరో పెయినో తర్వాత తెలుస్తది
Ramchandar Rao | జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల డ్రామాను ముంగటేసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. క్యూర్ చట్టంపై అనేక అభ్యంతరాలున్నయాని.. వాటిని ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. పన్నులు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు.
- జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ఇండ్ల డ్రామా ముంగటేసుకున్నరు
- 10 లక్షల మంది దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది
- రేవంత్ ప్రభుత్వం పేదల నుంచి ఇదొక రకమైన దోపిడీ చేస్తున్నది
- పన్నులు భారీగా పెరిగే అవకాశం ఉంది
- క్యూర్ చట్టంపై మా అభ్యంతరాలు తెలియజేస్తం
- ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శలు
Ramchandar Rao | త్రినేత్ర.న్యూస్: జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల డ్రామాను ముంగటేసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. క్యూర్ చట్టంపై అనేక అభ్యంతరాలున్నయాని.. వాటిని ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. పన్నులు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. అది క్యూరో.. పెయినో తర్వాత తెలుస్తుందని ఎద్దేవా చేశారు. 1955 చట్టంలో ప్రజల అవసరాలకనుగుణంగా మార్పులు చేస్తే అభ్యంతరం లేదన్నారు. ఈ మేరకు మంగళవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏటా 5 శాతం పన్నులు పెరిగే అవకాశం ఉంది..
క్యూర్ చట్టంలో 319 ప్రొవిజన్స్ ఉన్నాయి. 42 చాప్టర్స్ ఉన్నాయి. 1955 చట్టంలో మార్పులు రావాలి. ప్రజల అవసరాలకు అనుగుణంగా మారిస్తే మాకు అభ్యంతరం లేదు. అయితే ఈ క్యూర్ పేరు మీద చేసే అనేక ప్రొవిజన్స్‌లో కొన్ని అభ్యంతరాలు ఉన్నయ్. ముఖ్యంగా పన్నుల విషయంలో ఎక్కడ కూడా సైంటిఫిక్ ట్యాక్సేషన్ లేదు. ప్రతి సంవత్సరం 5 శాతం పన్నులు పెరిగే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ విలువ మీద పన్నులు రెండోది. పన్ను దోపిడీ ఉంటుంది. వాటర్, సీవరేజ్ బోర్డులు సెపరేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడైతే కలిపి పన్ను కడుతున్నరు. తర్వాత సెపరేట్ పన్నులు అయితయ్. ప్రజల మీద ఎంత భారం పడుతుందో మనం ఆలోచించాలి అని రాంచందర్‌రావు కోరారు.
కార్పొరేటర్లు, వార్డు సభ్యలు స్థానిక పరిపాలనలో భాగం ఉంటుండే. కానీ క్యూర్ చట్టంలో వీరి అభిప్రాయాలకు తావు లేదు. ఎన్నుకునే ప్రజాప్రతినిధులకు సంబంధించి ఈ చట్టంలో స్పష్టంగా లేదు. అనేక వర్గాల వారు దీన్ని వ్యతిరేకిస్తున్నరు. జవాబుదారీ ఎవరు ఉంటారు.. ఫండ్స్ అన్ని ఎవరికి డెలిగేట్ అయితయ్.. జోనల్ కమిషనర్‌కా? డిప్యూటీ కమిషనర్‌కా? కమిషనర్‌కా? ఇలా అనేక సందేహాలు ఉన్నయ్. మా ఎమ్మెల్యేలు తర్వాత అసెంబ్లీలో దీనిపై మాట్లాడతారు అని ఆయన స్పష్టం చేశారు.
క్యూర్, ప్యూర్, రేర్ ఏది తీసుకొచ్చిన పర్వాలేదు. కానీ వీటితో ప్రజలకు పెయిన్ వస్తుందనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో స్పష్టత ఎక్కడా లేదు. స్వతంత్ర పాలన అనే ఇందులో లేదు. 74 రాజ్యాంగ సవరణను డిఫీట్ చేస్తున్నట్లు మేం భావిస్తున్నం. ఇది సరైన చట్టం కాదు అని బీజేపీ చీఫ్ పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు తీసుకొస్తున్నమని నిన్న మంత్రులు గొప్పగా చెబుతున్నరు. వాళ్ల లెక్క ప్రకారం హైదరాబాద్‌లో 7 వేలకు పైగా ఇండ్లు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 10 లక్షల మంది దాకా అప్లయి చేసే అవకాశాలున్నయ్. వీళ్లందరి దగ్గర 10 వేల చొప్పున వసూలు చేసుకుంటున్నరు. తర్వాత ఇస్తమని అంటే ఎప్పుడు ఇస్తరో తెల్వదు. దాదాపు వెయ్యి కోట్లు వస్తయి. ఇదొక రకమైన రాబడిగా ప్రభుత్వం చూస్తున్నది. జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నయని ఏదో ఒక డ్రామా చేయాలని ఇది ముంగట వేసుకున్నరు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 32 వేలు తీసుకుంది. ఇంతవరకు కూడా తిరిగి బాధితులకు ఇవ్వలే. వీళ్లేమో 10 వేలు తీసుకుంటున్నరు. ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నరు అని సెటైర్లు విసిరారు.
16 నియోజకవర్గాల్లో ఇస్తామంటున్నరు. జవహర్‌నగర్ ప్రాంతంలో 20 అంతస్తుల ఇళ్లు కట్టారు. ఇప్పటికీ అట్లనే ఉన్నయ్. ఎవరికీ అలాట్‌మెంట్ చేయలే. బండ్లగూడు, పోచారం, అభిమాన్ టౌన్‌షిప్, చందానగర్‌లో, సహీరా టౌన్‌షిప్, గాజుల రామారంలో ఎవరికీ సరిగా అలాట్‌మెంట్ కాలే. వీటిపై ఎటువంటి విచారణ పెట్టలే అని రాంచందర్‌రావు మండిపడ్డారు.
కోట శ్రీనివాసరావు కోడిని వేలాడదీసినట్లు ఉంది ఈ పరిస్థితి..
ఇల్లు అనేది పేద ప్రజల కల. దయచేసి ఎక్కువ మందికి వచ్చేటట్లు చూడాలని రేవంత్‌రెడ్డిని అడుగుతున్నా. అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని వేలాడదీసి తినండ్రా బాబు అన్నట్లు ఉన్నది ఈ పరిస్థితి. రాజీవ్ స్వగృహాలు అట్లనే పడి ఉన్నయ్. వాటిని ఏం చేస్తారని అడుగుతున్నా? కనీసం రిపేర్ చేసి పేదలకు ఇవ్వండి. చాలా మందికి వస్తయ్. బీఆర్ఎస్ వాళ్లు సిటీ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కట్టారు. అలా అయితే ఉపాధి ఎక్కడ ఉంటుంది. వాళ్లు అడవిలో ఉన్నట్లే కదా. వాళ్లు తెలివి తక్కువ పని చేస్తే దానికంటే పెద్ద తుగ్లక్ పని మీరు చేస్తున్నరు అని ధ్వజమెత్తారు.
ముందు క్యూర్ చట్టంపై అభ్యంతరాలు తెలియజేస్తం. పన్నులు చాలా ఘోరంగా పెరుగుతయ్. సామాన్యుల మీద చాలా ప్రభావం పడుతుంది. ప్రజల ఆవేదనలను వినాలి. ఆ తర్వాతనే దీన్ని ప్రవేశపెట్టాలి. వీళ్లు ఇచ్చే 11 లక్షల నిధుల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఉంటాయి. అప్పుడు కట్టిన కాంట్రాక్టర్లు ఇప్పటికీ బిల్లుల కోసం సచివాలయం చుట్టూ తిరుగుతున్నరు. వెయ్యి కోట్ల కోసం పేదలకు అన్యాయం చేయొద్దు. పాత ఇళ్లను రిపేర్ చేసి పేదలకు పంచాలి. లేదంటే వాటిలో ఏం అవకతవకలు జరిగాయో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నం అని రాంచందర్‌రావు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Srinivas Goud | కృష్ణా, భీమా నదులపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు.. తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు : శ్రీనివాస్ గౌడ్
జులై 26, 2026

Servant Theft Cases | పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు.. మనం ఇచ్చే అవకాశమే నేరానికి కారణం: వీసీ సజ్జనార్
జులై 26, 2026

Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
జులై 26, 2026
తాజావార్తలు
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- ●Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ



