త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న‌ మ‌ల‌యాళం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ – సీన్ సీన్‌కో మ‌లుపు

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ పెట్టింది పేరు. ఈ జాన‌ర్‌లో మ‌ల‌యాళంలో వ‌చ్చిన లేటెస్ట్ మూవీ ఉయిర్ థియేట‌ర్ల‌లో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రోష‌న్ మాథ్యూ హీరోగా న‌టించిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఆగ‌స్ట్ 4 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Jul 26, 2026, 6.49 pm IST

Malayalam OTT | ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న‌ మ‌ల‌యాళం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ – సీన్ సీన్‌కో మ‌లుపు
Advertisement

Malayalam OTT |  రోష‌న్ మాథ్యూ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ఉయిర్ నిజాయితీతో కూడిన ప్ర‌య‌త్నంగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు ఎమ్‌. ప‌ద్మ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. బైజు సంతోష్‌, అతుల్య చంద్ర‌, శృతి మీన‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

జియో హాట్‌స్టార్‌...

జూన్ నెలాఖ‌రున థియేట‌ర్ల‌లో రిలీజైన ఉయిర్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మ‌ల‌యాళం మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. ఆగ‌స్ట్ 4 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. మ‌ల‌యాళం, తెలుగుతో పాటు మ‌రో మూడు భాష‌ల్లో రిలీజ్ అవుతోంది.

పోలీస్ ఆఫీస‌ర్ రాసిన క‌థ‌....

కేర‌ళ‌లో పోలీస్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేసిన షాజీ మ‌రాడ్ ఉయిర్‌ సినిమాకు క‌థ‌ను అందించారు. వృత్తి ప‌రంగా తాను ఎదుర్కొన్న స‌వాళ్లు, అనుభ‌వాల‌ను ఆధారంగా చేసుకొని క‌థ‌ను రాశారు. కేర‌ళ‌లోని కొడువ‌ల్లి ఏరియాలో ఉన్న పోలీస్ స్టేష‌న్‌కు అజీబ్ ప్రొబెష‌న‌రీ ఎస్ఐగా వ‌స్తాడు. అత‌డు ఉద్యోగంలో చేరిన కొద్ది రోజుల్లోనే ఓ గుర్తుతెలియ‌ని మ‌హిళా డెడ్‌బాడీ కేసు సంచ‌ల‌నంగా మారుతుంది. తొలుత ఆత్మ‌హ‌త్య‌గా భావించి కేసును కొట్టేయాల‌ని పోలీసులు అనుకుంటారు. అజీబ్ ఇన్వేస్టిగేష‌న్‌లో చ‌నిపోయిన మ‌హిళ పేరు శోభ‌గా తేలుతుంది. ఆమె చావు వెన‌కున్న ఒక్కో ఆధారాన్ని సేక‌రిస్తాడు అజీబ్‌. హ్యూమ‌న్ ట్రాఫికింగ్‌కు చెందిన పెద్ద నెట్‌వ‌ర్క్ శోభ మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌ని బ‌య‌ట‌పెడ‌తాడు అజీబ్‌. చివ‌ర‌కు ఆ హంత‌కుల‌ను అత‌డు ఎలా ప‌ట్టుకున్నాడు? అన్న‌దే ఉయిర్ మూవీ క‌థ‌.

హీరోగా...క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా...

మ‌ల‌యాళంలో హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కొన‌సాగుతోన్నాడు రోష‌న్ మాథ్యూ. మూథ‌న్‌, క‌ప్పేలా, కోబ్రా, గోల్డ్‌, ధూమం, రోనిత్‌తో పాటు ప‌లు సినిమాలు న‌టుడిగా అత‌డికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. రోష‌న్ మాథ్యూ హీరోగా న‌టించిన కొన్ని మ‌ల‌యాళ సినిమాలు తెలుగులోకి డ‌బ్ అయ్యాయి.

 

Advertisement
Advertisement