CP Sajjanar | ఏఐ కెమెరాలతో నిరంతర నిఘా.. 2400 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు
CP Sajjanar | ఆషాఢ మాస బోనాల వేళ ఏఐ కెమెరాలతో నిరంతర నిఘా చేస్తున్నామని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. 48 గంటల పాటు 2,400 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు.
- బోనాల వేళ 48 గంటల పాటు నగరంలో భద్రత ఏర్పాటు చేశాం
- హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ వెల్లడి
CP Sajjanar | త్రినేత్ర.న్యూస్: ఆషాఢ మాస బోనాల వేళ ఏఐ కెమెరాలతో నిరంతర నిఘా చేస్తున్నామని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. 48 గంటల పాటు 2,400 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యాధునిక ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నామన్నారు. ముఖ్యంగా దొంగలు, చైన్ స్నాచర్లను త్వరగా గుర్తించేందుకు ఏఐ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. 2400 మంది పోలీస్ సిబ్బందిని రెండు షిఫ్టులుగా విభజించి బందోబస్తు విధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. భక్తుల రక్షణ కోసం షీ టీమ్‌లు, క్రైమ్ టీమ్‌లను రంగంలోకి దించడంతో పాటు ఆలయాల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తుల సహకారంతో ఉత్సవాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు.


ఆలయ ప్రాంగణాలతో పాటు ఊరేగింపు సాగే మార్గాల్లో డ్రోన్లు, అదనపు సీసీ కెమెరాలను అమర్చామని, భద్రతా పర్యవేక్షణ కోసం లాల్‌దర్వాజా యూనియన్ బ్యాంక్ వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో అదనపు సీపీ క్రైమ్స్ శ్రీనివాస్, లా అండ్ ఆర్డర్ అదనపు సీపీ తఫ్షీర్ ఇక్బాల్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, చార్మినార్ జోన్ డీసీపీ ఖారే కిరణ్ ప్రభాకర్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, డీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఆర్.వెంకటేశ్వర్లు, డీసీపీలు శ్రీనివాస్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Priyanka | మెడికో ప్రియాంక మృతి
- ●Kadiyam Kavya | బైండ్ల సమాజం మరింత ఎదగాలి : ఎంపీ కడియం కావ్య
- ●Raids on Drugs | యాదాద్రి జిల్లాలో భారీ ఆపరేషన్.. రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
- ●Minister Seethakka | ఆదివాసీల హక్కులు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత : మంత్రి సీతక్క
- ●World Indigenous Peoples Day | అభివృద్ధి వైపు అడుగులు వేయాలి : మంత్రి లక్ష్మణ్‌కుమార్
- ●KCR | 'పెద్ది' కుటుంబ సభ్యులకు కేసీఆర్ పరామర్శ

Priyanka | మెడికో ప్రియాంక మృతి

Kadiyam Kavya | బైండ్ల సమాజం మరింత ఎదగాలి : ఎంపీ కడియం కావ్య

Raids on Drugs | యాదాద్రి జిల్లాలో భారీ ఆపరేషన్.. రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

Minister Seethakka | ఆదివాసీల హక్కులు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత : మంత్రి సీతక్క



