త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Student protest | ప‌రీక్ష‌ల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌పై అసెంబ్లీ వ‌ర‌కూ విద్యార్థుల‌ మార్చ్‌.. జార్ఖండ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్‌

Student protest | జార్ఖండ్‌లో టెన్ష‌న్‌ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌పై విద్యార్థులు ఆందోళ‌న చేస్తున్న (Student protest) విష‌యం తెలిసిందే.

D

National | Published On Aug 10, 2026, 11.45 am IST

Student protest | ప‌రీక్ష‌ల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌పై అసెంబ్లీ వ‌ర‌కూ విద్యార్థుల‌ మార్చ్‌.. జార్ఖండ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్‌
Advertisement

Student protest | జార్ఖండ్‌లో టెన్ష‌న్‌ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌పై విద్యార్థులు ఆందోళ‌న చేస్తున్న (Student protest) విష‌యం తెలిసిందే. JPSC, JSSC పరీక్షలు రద్దు చేయాలంటూ గ‌త 17 రోజులుగా నిర‌స‌న తెలుపుతున్నారు. ఈ నిర‌స‌న‌ల్లో భాగంగా విద్యార్థి నేత‌లు ఇవాళ అసెంబ్లీ ముట్ట‌డికి (విధానసభ ఘెరావ్ మార్చ్‌) పిలుపునిచ్చారు. రాంచీ (Ranchi)లోని పాత అసెంబ్లీ భ‌వ‌నం స‌మీపంలో పోలీసు బారికేడ్ల‌ను బ‌ద్ద‌లుకొట్టి విద్యార్థులు కొత్త అసెంబ్లీ భ‌వనం వైపు దూసుకెళ్లారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది.

మ‌రోవైపు పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసం ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న బీజేపీ నేత‌లు ఆదిత్య సాహు, బాబూలాల్ మరాండీతో సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న‌ట్లు విద్యార్థులు స్ప‌ష్టం చేశారు. ఎలాంటి హింసకు తావులేకుండా శాంతియుతంగా, రాజ్యాద్ధబద్ధంగా ఈ మార్చ్ కొనసాగుతుందని విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ తెలిపారు.

అయితే, బారికేడ్ల‌ను తొల‌గించి విద్యార్థులు దూసుకురావ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వారిని అడ్డుకునేందుకు వాట‌ర్ కెనాన్ల‌ను ప్ర‌యోగించారు. నిర‌స‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. దీంతో రాంచీలో తీవ్ర ఉద్రిక్త‌ ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు వాట‌ర్‌ కెనాన్లు ప్ర‌యోగిస్తున్న స‌మ‌యంలో కొంద‌రు నిర‌స‌న‌కారులు నృత్యాలు చేస్తూ క‌నిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైర‌ల్‌గా మారాయి.

Also Read..

రాత్రికిరాత్రే గ‌ద్దె కూల్చివేత‌.. న‌ర్సంపేట‌లో బీఆర్ఎస్ నేత‌ల ధ‌ర్న‌.. ఉద్రిక్త‌త‌

స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. మార్కెట్‌ల‌లో తీవ్ర హెచ్చు త‌గ్గులు..

ఉద్యోగంలో చేరిన నాలుగు రోజుల‌కే.. మ‌హిళ‌పై సెక్యూరిటీ గార్డ్ అఘాయిత్యం

Advertisement
Advertisement