త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka | ప్రియాంక కుటుంబానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది: మంత్రి వాకిటి శ్రీహ‌రి

G

Telangana | Published On Aug 10, 2026, 12.46 pm IST

Priyanka | ప్రియాంక కుటుంబానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది: మంత్రి వాకిటి శ్రీహ‌రి
Advertisement

Priyanka | త్రినేత్ర‌.న్యూస్‌: వైద్య విద్యార్థిని ప్రియాంక (Priyanka) మృత‌దేహానికి గాంధీ ద‌వాఖాన‌లో పోస్టు మార్టం పూర్త‌యింది. దీంతో వైద్యులు ఆమె మృత‌దేహాన్ని త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు. స్వ‌స్థ‌లం గ‌ద్వాల (Gadwal) జిల్లా ఐజ మండ‌లం ఎక్లాస్‌పూర్‌కి త‌ర‌లించ‌నున్నారు. సోమ‌వారం సాయంత్రం ఆమె అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

కాగా, గాంధీ హాస్పిట‌ల్ (Gandhi Hospital) వ‌ద్ద ప్రియాంక భౌతిక కాయానికి మంత్రి వాకిటి శ్రీహ‌రి (Vakiti Srihari), ఏఐసీసీ కార్య‌ద‌ర్శి సంప‌త్ కుమార్ నివాళుల‌ర్పించారు. ప్రియాంక తండ్రిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్రియాంక ఘటన అత్యంత దురదృష్టకర‌మ‌న్నారు. ఆమె మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షంచాల‌ని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెంటనే స్పందించి త‌మ‌కు, అధికారులకు ఆదేశాలు ఇచ్చార‌ని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరుగకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంద‌ని చెప్పారు. చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని నిందితులు తప్పించుకోకుండా కఠినంతరం చేయాల‌న్నారు.

స్కూటీపై వెళ్తుండ‌గా కారుతో ఢీకొట్టారు..

సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మెడికో ప్రియాంక( Priyanka ) ప్రాణాలు విడిచారు. మధ్యాహ్నం 3.25 గంట‌ల‌కు ప్రియాంక తుదిశ్వాస విడిచినట్లు కిమ్స్( KIMS ) ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రియాంక స్వస్థలం గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్‌పూర్. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఆమె ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజమహేంద్రవరంలో పీజీ చదువుతున్నారు. ఈనెల 3న స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను హైదరాబాద్​కు తరలించి, చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఆమె క‌న్నుమూశారు.

హిట్ అండ్ ర‌న్ కాదు..

మెడికో ప్రియాంక కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఆమెది హిట్ అండ్ రన్ కాదని.. నిందితులు హత్యాయత్నం చేశార‌ని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ ఆదివారం అధికారికంగా ప్ర‌క‌టించారు. రాజమండ్రిలోని ఓ మాల్‌లో నిందితులతో ప్రియాంక వాగ్వాదానికి దిగిందని, ఆ కోపంతోనే ప్రియాంకను చంపేందుకు ప్రయత్నించారని చెప్పారు. నిందితులపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశామ‌ని తెలిపారు.

నిందితులు మొదట ఆదిత్య మాల్ వద్దకు మద్యం మత్తులో వెళ్లారు. అక్కడ వారిని సెక్యూరిటీ సిబ్బంది నిలువరించడంతో గొడవ జరిగింది. అదే సమయంలో అక్కడే ఉన్న డాక్టర్ ప్రియాంక నిందితుల ప్రవర్తనను ప్రశ్నిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. అనంత‌రం మాల్ నుండి బయలుదేరిన ప్రియాంక, ఆమె స్నేహితురాలి స్కూటీని నిందితులు తమ కారుతో వెంట వెంటనే మూడుసార్లు ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారు. ప్రియాంక కింద ప‌డిపోవ‌డంతో ఆమె తలపై నుంచి కారు పోనిచ్చి అత్యంత క్రూరంగా ప్రవర్తించారు అని ఎస్పీ తెలిపారు.

కారు నడిపిన సూరవరపు జశ్వంత్ (A1), పక్కన కూర్చున్న ఆండ్రూ జోసెఫ్ (A2) లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరికి రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. సీసీటీవీ ఫుటేజీలు, పక్కా ఆధారాలతో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ న‌ర‌సింహ‌ స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement