త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ola Electric | ఓలా ఎల‌క్ట్రిక్ భారీ డీల్‌.. భారీ బ్యాట‌రీ ఎన‌ర్జీ స్టోరేజ్ సిస్ట‌మ్స్ రంగంలోకి అడుగు..

Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. యాక్సిస్ ఎనర్జీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం 2032 నాటికి గరిష్ఠంగా 20 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

S

Business | Published On Aug 10, 2026, 12.05 pm IST

Ola Electric | ఓలా ఎల‌క్ట్రిక్ భారీ డీల్‌.. భారీ బ్యాట‌రీ ఎన‌ర్జీ స్టోరేజ్ సిస్ట‌మ్స్ రంగంలోకి అడుగు..
Advertisement

Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. యాక్సిస్ ఎనర్జీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం 2032 నాటికి గరిష్ఠంగా 20 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్‌కు చెందిన రాబోయే ఎనర్జీ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్ మహాశక్తికి ఇది తొలి భారీ స్థాయి భాగస్వామ్యంగా నిలవనుంది. వాణిజ్య, పారిశ్రామిక, యుటిలిటీ స్థాయి అవసరాల కోసం రూపొందిస్తున్న ఈ ప్లాట్‌ఫామ్‌ను ఆగస్టు 15న ప్రారంభించేందుకు ఓలా ఎలక్ట్రిక్ సిద్ధమవుతోంది. ఓలా ఎలక్ట్రిక్ వ‌ర్టిక‌ల్‌ సమగ్ర వ్యాపార నమూనాను అనుసరిస్తోంది. సెల్ టెక్నాలజీ నుంచి తయారీ, సిస్టమ్ ఇంజినీరింగ్ వరకు మొత్తం ప్రక్రియను సంస్థ తన పరిధిలోకి తీసుకురావడం ద్వారా బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థల మొత్తం నిర్వహణ వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది. ఈ సెల్-టు-సిస్టమ్ ప్లాట్‌ఫామ్ ద్వారా భద్రత, పనితీరు, మొత్తం యాజమాన్య వ్యయం విషయంలో మెరుగైన పరిష్కారాన్ని అందిస్తామ‌ని కంపెనీ చెబుతోంది.

బ్యాట‌రీ ఎన‌ర్జీ స్టోరేజ్ వ్య‌వ‌స్థ‌లో పోటీ..

యాక్సిస్ ఎనర్జీతో కుదిరిన భాగస్వామ్యం ఓలా ఎలక్ట్రిక్ మహాశక్తి యుటిలిటీ స్థాయి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలకు భవిష్యత్తులో ఎంతటి డిమాండ్ ఉండవచ్చో చూపించే తొలి భారీ స్థాయి ఉదాహరణగా నిలుస్తుందని కంపెనీ పేర్కొంది. దీంతో బ్యాటరీ స్టోరేజ్ వ్యాపారం ఓలా ఎలక్ట్రిక్‌కు కొత్త కీలక వృద్ధి అవకాశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో ఎనర్జీ స్టోరేజ్ అవకాశాలను అందిపుచ్చుకోవడమే మహాశక్తి లక్ష్యంగా ఉంది. భారత్‌లోనే రూపకల్పన చేసి తయారు చేసే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్లాట్‌ఫామ్‌ను ఓలా అభివృద్ధి చేస్తోంది. పునరుత్పాదక విద్యుత్ అనుసంధానం, పారిశ్రామిక విద్యుత్ అవసరాలు, విద్యుత్ గ్రిడ్ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ల వంటి రంగాల్లో ఈ వ్యవస్థలను వినియోగించనున్నారు.

భారీ స్థాయిలో యాక్సిస్ ఎన‌ర్జీ ప్రాజెక్టులు..

ఇక యాక్సిస్ ఎనర్జీ కూడా భారీ స్థాయిలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 3,750 మెగావాట్లకు పైగా ప్రాజెక్టులకు గ్రిడ్ అనుమతులను ఇప్పటికే పొందినట్లు సంస్థ తెలిపింది. అలాగే సుమారు 3,500 మెగావాట్ల ప్రాజెక్టుల పైప్‌లైన్ కూడా యాక్సిస్ ఎనర్జీ వద్ద ఉంది. ఈ ప్రాజెక్టుల్లో ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ, హైబ్రిడ్, ఇతర నాన్-సోలార్ కాన్ఫిగరేషన్లు ఉన్నాయి. పునరుత్పాదక విద్యుత్‌ను సమర్థంగా గ్రిడ్‌లోకి అనుసంధానించడంతోపాటు గ్రిడ్ విశ్వసనీయతను పెంచేందుకు, నిరంతరాయంగా స్వచ్ఛమైన విద్యుత్‌ను అందించేందుకు భారీ స్థాయి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలు అవసరమవుతాయని యాక్సిస్ ఎనర్జీ తెలిపింది.

Advertisement
Advertisement