త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sri Chaitanya School | క‌ర్ర‌లతో కొట్టి.. బూట్ల‌తో తొక్కారు.. ద‌మ్మాయిగూడ‌ శ్రీచైత‌న్య సూల్‌లో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిపై స‌హ‌చ‌రుల దాడి..

Sri Chaitanya School | మేడ్చ‌ల్ జిల్లా ద‌మ్మాయిగూడ‌లోని శ్రీచైత‌న్య (Sri Chaitanya School) హైస్కూల్‌లో విద్యార్థిపై స‌హ‌చ‌రులు దాడికి పాల్ప‌డ్డారు. క‌ర్ర‌ల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా కొట్ట‌డ‌మే కాకుండా బూట్ల‌తో ముఖంపై తొక్కారు.

G

Telangana | Published On Aug 10, 2026, 12.01 pm IST

Sri Chaitanya School | క‌ర్ర‌లతో కొట్టి.. బూట్ల‌తో తొక్కారు.. ద‌మ్మాయిగూడ‌ శ్రీచైత‌న్య సూల్‌లో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిపై స‌హ‌చ‌రుల దాడి..
Advertisement

Sri Chaitanya School | త్రినేత్ర‌.న్యూస్‌: మేడ్చ‌ల్ జిల్లా ద‌మ్మాయిగూడ‌లోని శ్రీచైత‌న్య (Sri Chaitanya School) హైస్కూల్‌లో విద్యార్థిపై స‌హ‌చ‌రులు దాడికి పాల్ప‌డ్డారు. క‌ర్ర‌ల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా కొట్ట‌డ‌మే కాకుండా బూట్ల‌తో ముఖంపై తొక్కారు. అయితే స్కూలు యాజ‌మాన్యం.. బాధితుడి త‌ల్లిదండ్రుల‌కు అస‌లు విష‌యం చెప్ప‌కుండా మెట్ల‌పై నుంచి ప‌డిపోయాడంటూ స‌మాచారం అందించారు.

కామారెడ్డికి (Kamareddy) చెందిన అభిషేక్ ద‌మ్మాయిగూలోని (Dammaiguda) శ్రీచైత‌న్య స్కూలులో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. హాస్ట‌ల్‌లో రాత్రి స‌మ‌యంలో మ‌రో 12 మంది విద్యార్థులు అభిషేక్‌పై దాడికి పాల్ప‌డ్డారు. క‌ర్ర‌లు, ప్లేట్ల‌తో కొట్టి.. బూట్ల‌తో ముఖంపై తొక్కారు. దీంతో అత‌డు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కాగా, అభిషేక్ మెట్ల‌పైనుంచి కింద ప‌డిపోయాడంటూ స్కూలు సిబ్బంది అత‌ని త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే స్కూల్‌కి వెళ్లి అత‌డిని త‌మ‌తో ఇంటికి తీసుకెళ్లారు. కాగా, ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుత హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నాడు.

అయితే ర్యాగింగ్ (Ragging) పేరుతో తోటి విద్యార్థులు త‌న‌పై దాడి చేశార‌ని అభిషేక్ త‌న త‌ల్లిదండ్రుల‌కు చేప్పాడు. దీంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌మ కుమారుడిని తీవ్రంగా కొట్టిన వారిపై, ఘ‌ట‌న బ‌య‌ట‌కు రాకుండా దాచిన స్కూలు యాజ‌మాన్యంపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement