త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Juloori Gouri Shankar | రాజేశ్వ‌ర్ రావుకు జూలూరు గౌరీ శంక‌ర్ నివాళి

Juloori Gouri Shankar | హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ వ్యవస్థాపకులు రాజేశ్వర్ రావు ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆయ‌న‌ మృతి పట్ల తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్, బుక్ ఫెయిర్ పూర్వ అధ్య‌క్షులు జూలూరు గౌరీశంక‌ర్, పూర్వ కార్య‌ద‌ర్శి కోయ చంద్ర‌మోహ‌న్‌ సంతాపం ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On Aug 9, 2026, 6.37 pm IST

Juloori Gouri Shankar | రాజేశ్వ‌ర్ రావుకు జూలూరు గౌరీ శంక‌ర్ నివాళి
Advertisement

Juloori Gouri Shankar | త్రినేత్ర‌.న్యూస్ : హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ వ్యవస్థాపకులు రాజేశ్వర్ రావు ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆయ‌న‌ మృతి పట్ల తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్, బుక్ ఫెయిర్ పూర్వ అధ్య‌క్షులు జూలూరు గౌరీశంక‌ర్, పూర్వ కార్య‌ద‌ర్శి కోయ చంద్ర‌మోహ‌న్‌ సంతాపం ప్ర‌క‌టించారు. వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

రాజేశ్వరరావు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్‌లో ప్యాకర్‌గా తన జీవితాన్ని ప్రారంభించి, 40 ఏళ్ల పాటు జనరల్ మేనేజర్‌గా సేవలందించాడు. పుస్తక రంగానికి రెండు రాష్ట్రాలలో ఎనలేని సేవలు అందించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ తొలి కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, కోశాధికారిగా వివిధ బాధ్యతల్లో 36 ఏళ్ల పాటు సేవలు అందించారు. ప్రగతి పబ్లికేషన్స్ పేరుతో తెలుగు సాహిత్యం తదితర అంశాలపై పుస్తకాలను ముద్రించారని జూలూరు గౌరీశంక‌ర్ గుర్తు చేశారు.

Advertisement
Advertisement