త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP Shivadhar Reddy | డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి నియామ‌క ఉత్త‌ర్వుల ర‌ద్దుకు హైకోర్టు నిరాక‌ర‌ణ‌

DGP Shivadhar Reddy | తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి నియామ‌క ఉత్త‌ర్వుల ర‌ద్దుకు హైకోర్టు నిరాక‌రించింది. రెండు వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును యూపీఎస్సీకి పంపాల‌ని ఆదేశించింది.

S

Telangana | Published On Dec 24, 2025, 1.06 pm IST

DGP Shivadhar Reddy | డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి నియామ‌క ఉత్త‌ర్వుల ర‌ద్దుకు హైకోర్టు నిరాక‌ర‌ణ‌
Advertisement

DGP Shivadhar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి నియామ‌క ఉత్త‌ర్వుల ర‌ద్దుకు హైకోర్టు నిరాక‌రించింది. రెండు వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును యూపీఎస్సీకి పంపాల‌ని ఆదేశించింది. సుప్రీంకోర్టు నిబంధ‌న‌ల మేర‌కు ప్యానెల్ లిస్టు ఉండాల‌ని హైకోర్టు సూచించింది. యూపీఎస్సీకి ప్యానెల్ లిస్టు పంపిన త‌ర్వాత‌.. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను జ‌న‌వ‌రి 20కి కోర్టు వాయిదా వేసింది.

తెలంగాణ డీజీపీగా శివ‌ధ‌ర్ రెడ్డి అక్టోబ‌ర్ 1వ తేదీన‌ నియామ‌క‌మైన విష‌యం తెలిసిందే. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్న శివ‌ధ‌ర్ రెడ్డి డీజీపీగా బాధ్య‌త‌లు స్వీక‌రించే కంటే ముందు.. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విధులు నిర్వ‌ర్తించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement