Chamala Kirankumar | జనగామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
Chamala Kirankumar | గుడిసెల్లో నివసిస్తున్న పేద ప్రజల కోసం ఇళ్ల నిర్మాణాలు, పట్టణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
Chamala Kirankumar | త్రినేత్ర న్యూస్: గుడిసెల్లో నివసిస్తున్న పేద ప్రజల కోసం ఇళ్ల నిర్మాణాలు, పట్టణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి జనగామ పట్టణంలో ఆయన విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రెస్టన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఎంపీ పాల్గొని మాట్లాడారు.
జనగామ మున్సిపాలిటీ పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేకంగా కేటాయించిన 16 గార్బేజ్ కలెక్షన్ ఆటోలను మంత్రి పొంగులేటి జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలో చెత్త నిర్వహణ, మురుగునీటి శుద్ధి లక్ష్యంగా నూతనంగా నిర్మించనున్న డంపింగ్ యార్డ్ (Dumping Yard), సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (STP) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన రెవెన్యూ సేవలను అందించేందుకు నూతనంగా నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.
పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ నూతనంగా నిర్మించిన 168 డబుల్ బెడ్‌రూమ్ (2-BHK) ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని మంత్రి, ఎంపీ ప్రారంభించారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన పేదల కోసం 500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. ఫేజ్-II (Phase-II) ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Web Series | డేటింగ్ యాప్ కల్చర్‌పై రజనీకాంత్ కూతురు రొమాంటిక్ వెబ్‌సిరీస్ - లిప్‌లాక్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ట్రైలర్
- ●Kunal Ghosh | దీదీ సభకు వెళ్తుండగా.. ఎమ్మెల్యేపై రాళ్ల దాడి
- ●Duronto Express Stone Pelting | పట్టాలపై దారుణం: దురంతో ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. భోజనం చేస్తున్న ప్రయాణికుల పక్కనే పగిలిన కిటికీ అద్దాలు
- ●e-Pindaan | ఆన్లైన్లోనే పితృకార్యాలు.. కాశీలో ఈ-తర్పణ్..!
- ●UPI Payment Splitting Risk | చార్జీలు తప్పించుకునేందుకు ఒకే బిల్లును పదే పదే రూ.2000 చొప్పున స్ప్లిట్ చేసి పేమెంట్ చేయొచ్చా?
- ●DGP CV Anand | గణేశ్ నిమజ్జనాల్లో అపశృతి.. 13 మంది మృతి : డీజీపీ సీవీ ఆనంద్

Web Series | డేటింగ్ యాప్ కల్చర్‌పై రజనీకాంత్ కూతురు రొమాంటిక్ వెబ్‌సిరీస్ - లిప్‌లాక్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ట్రైలర్

Kunal Ghosh | దీదీ సభకు వెళ్తుండగా.. ఎమ్మెల్యేపై రాళ్ల దాడి

Duronto Express Stone Pelting | పట్టాలపై దారుణం: దురంతో ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. భోజనం చేస్తున్న ప్రయాణికుల పక్కనే పగిలిన కిటికీ అద్దాలు

e-Pindaan | ఆన్లైన్లోనే పితృకార్యాలు.. కాశీలో ఈ-తర్పణ్..!











