CM Vikarabad Tour | 15న సంగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి
CM Vikarabad Tour | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 15న సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు సీఎం పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
- స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..
- 50వేల మందితో సభకు ఏర్పాట్లు
CM Vikarabad Tour | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 15న సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు సీఎం పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సంగారెడ్డిలోని తారా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్, అంబేద్కర్ స్టేడియంలో సభా ప్రాంగణాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. సభకు పెద్దఎత్తున జన సమీకరణ చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 50వేల మందితో సభ నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.
1.05కోట్ల మందికి స్మార్ట్ కార్డులు
ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో అరకొరగానే రేషన్ కార్డులు ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కోటి 5 లక్షల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించబోతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కమిట్‌మెంట్‌తో పనిచేస్తోందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందన్నారు.
సీఎంకు ఘన స్వాగతం
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్‌రెడ్డికి ఘనంగా స్వాగతం పలుకుతామని జగ్గారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా చర్యలు, సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TPCC | ఎస్ఐఆర్పై కాంగ్రెస్ అనుమానాలు
- ●Paytm | పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక క్లాడ్ ఏఐతో చెల్లింపులు చేయవచ్చు..
- ●Palamuru-Rangareddy Project | పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం.. స్పష్టం చేసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ
- ●Tabu | ఫియర్లెస్...రూత్‌లెస్...ఫస్ట్ టైమ్ మాస్ రోల్లో టబు - స్లమ్ డాగ్ గ్లింప్స్ రిలీజ్
- ●Savings Account | ఐటీ నోటీసులు రావొద్దంటే బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో గరిష్టంగా ఎంత పొదుపు చేయవచ్చు..?
- ●Samantha | తమిళ ఓటీటీ షో - హోస్ట్‌గా సమంత - బిగ్‌బాస్‌తో పోటీకి రెడీ

TPCC | ఎస్ఐఆర్పై కాంగ్రెస్ అనుమానాలు

Paytm | పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక క్లాడ్ ఏఐతో చెల్లింపులు చేయవచ్చు..

Palamuru-Rangareddy Project | పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం.. స్పష్టం చేసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ

Tabu | ఫియర్లెస్...రూత్‌లెస్...ఫస్ట్ టైమ్ మాస్ రోల్లో టబు - స్లమ్ డాగ్ గ్లింప్స్ రిలీజ్




