త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | హుజూరాబాద్‌లో 394 ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చాం.. ప్ర‌తిప‌క్షాలు పొర్లుదండాలు పెట్టినా ప‌థ‌కాలు ఆపం

Ponguleti Srinivas Reddy | హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో 394 డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల ల‌బ్ధిదారుల‌కు ప‌ట్టాలు పంపిణీ చేశామ‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి తెలిపారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో రూ.3.23 కోట్లతో నిర్మించ తలపెట్టిన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామ‌న్నారు. అనంతరం మండల కేంద్రంలో రూ.3.25 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నూతన భవనాన్ని ప్రారంభించిన‌ట్లు చెప్పారు.

S

Telangana | Published On Aug 10, 2026, 4.01 pm IST

Ponguleti Srinivas Reddy | హుజూరాబాద్‌లో 394 ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చాం.. ప్ర‌తిప‌క్షాలు పొర్లుదండాలు పెట్టినా ప‌థ‌కాలు ఆపం
Advertisement
  • ఎల్కతుర్తిలో రూ.3.23 కోట్లతో త‌హ‌సీల్దార్ భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న చేశాం
  • రూ.3.25 కోట్లతో నిర్మించిన కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభించాం
  • ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్: హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో 394 డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల ల‌బ్ధిదారుల‌కు ప‌ట్టాలు పంపిణీ చేశామ‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి తెలిపారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో రూ.3.23 కోట్లతో నిర్మించ తలపెట్టిన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామ‌న్నారు. అనంతరం మండల కేంద్రంలో రూ.3.25 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నూతన భవనాన్ని ప్రారంభించిన‌ట్లు చెప్పారు. ప్రతిపక్షపార్టీ నాయకులు పొర్లుదండాలు పెట్టిన ప్రజాప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగవని స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి హనుమకొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన‌ట్లు వివరించారు.

హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో గూడూరు, కమలాపూర్, మర్రిపెల్లిగూడెం గ్రామాలకు చెందిన 394 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించే పట్టాలు పంపిణీ చేశాం. ప్రజా ప్రభుత్వంలో పార్టీలకతీతంగా అన్ని నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నాం. కేజీబీవీ విద్యార్థినులకు హాస్టల్‌లో అవసరమయ్యే వస్తువులను అందజేశాం. ఈ వేదికగా SSC, ఇంటర్ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులను సత్కరించాం అని పొంగులేటి తెలిపారు.

పేదల ఆత్మగౌరవానికి చిహ్నమైన సొంతింటి కలను ప్రజాప్రభుత్వం సాకారం చేస్తుంది. పల్లె, పట్టణం తేడా లేకుండా కుల, మత, రాజకీయాలకతీతంగా అర్హులైన‌ పేదలందరికీ ఇండ్లను అందిస్తున్నాం. ఎలాంటి పక్షపాతం లేకుండా గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్‌రూం ఇండ్లకు వందల కోట్ల నిధులు కేటాయించి నిర్మాణాలు, మౌలిక వసతులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నాం అని మంత్రి శ్రీ‌నివాస్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

ఎన్నో ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక విధ్వంసం చేసింది. రాష్ట్ర అభివృద్ధిని, పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి అప్పుల ఊబిలోకి నెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాసంక్షేమం కోసం ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి ముందుకు సాగుతుంది అని పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement