త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Palle Rvikumar | రాహుల్ గాంధీ డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటే తప్పులేదు..కానీ కేటీఆర్ వేసుకుంటే తప్పైతదా?

Palle Rvikumar | డిశ్చార్జ్ పిటిషన్‌ను కోర్టు తేలుస్తుంద‌ని.. కాంగ్రెస్ వాళ్లు ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ ప్ర‌శ్నించారు. కేటీఆర్‌ను కోర్టుల చుట్టూ తిప్పాల‌నేది సీఎం రేవంత్ కుట్ర అని విమ‌ర్శించారు.

S

Telangana | Published On Oct 13, 2026, 2.12 pm IST

Palle Rvikumar | రాహుల్ గాంధీ డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటే తప్పులేదు..కానీ కేటీఆర్ వేసుకుంటే తప్పైతదా?
Advertisement
  • డిశ్చార్జి పిటిషన్ సంగతి కోర్టు తేలుస్తది.. కాంగ్రెస్ కు భయమెందుకు?
  • కేటీఆర్‌ను కోర్టుల చుట్టూ తింపాల‌నేది రేవంత్ కుట్ర‌
  • ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ భ‌య‌ప‌డ‌రు
  • కేబీఆర్ ప‌నులు ఆపి 300 కోట్లు దుర్వినియోగం చేసినందుకు రేవంత్‌పై కేసు పెట్టాలి
  • కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్

Palle Rvikumar | త్రినేత్ర న్యూస్‌: డిశ్చార్జ్ పిటిషన్‌ను కోర్టు తేలుస్తుంద‌ని.. కాంగ్రెస్ వాళ్లు ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ ప్ర‌శ్నించారు. కేటీఆర్‌ను కోర్టుల చుట్టూ తిప్పాల‌నేది సీఎం రేవంత్ కుట్ర అని విమ‌ర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ భయపడరన్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్లు తవ్వి రూ.300 కోట్లు దుర్వినియోగం చేశారని.. దీనిపై సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామ‌న్నారు.

ఛార్జ్ షీట్‌లో ఏం తేల్చారో చెప్పాలి..

ఆది శ్రీనివాస్ ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఊర్ల మీద పడి ఊరేగుతున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ ద్వారా హైదరాబాద్ కు పెట్టుబడులు వచ్చాయి. కుట్రపూరితంగా కేటీఆర్‌ను బద్నాం చేయాలని ఫార్ములా ఈ కార్ రేస్ పై ఏసీబీ కేసు పెట్టారు. కేటీఆర్ ను కేసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పాలనేది రేవంత్ రెడ్డి కుట్ర. ఛార్జ్ షీట్‌లో ఏం తేల్చారో చెప్పాలి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు లొట్టపీసు కేసు.

ముక్కు నేల‌కు రాయాలి

చాలా కేసుల్లో రాహుల్ గాంధీ స్క్వాష్ పిటిషన్ వేసుకున్నారు. కేటీఆర్ అనేకసార్లు కోర్టులకు హాజరయ్యారు. ఎల్‌నినో పేరు మీద ప్రభుత్వం ప్రజల ఉసురు పోకుంటుంది. మేడిగడ్డ నీళ్లను లిఫ్ట్ చేసి రిజర్వాయర్లను ఎందుకు నింపలేదు? కరోనా కాలంలో సైతం రాష్ట్రాన్ని కేసీఆర్ సమర్థవంతంగా నడిపారు. రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణిలో నాణ్యమైన బొగ్గును ఇతర రాష్ట్రాలకు అమ్ముతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్ర‌స‌క్తే లేదు. రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు. మంత్రులు రెండవ పంట వేసుకోవద్దని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. పరిపాలన చేతగావడం లేదని ముక్కు నేలకు రాయాలి అని ప‌ల్లె ర‌వికుమార్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement