త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Mallu Ravi | ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు.. ల‌బ్ధిదారుల్లో సంతోషం నింపారు

MP Mallu Ravi | నాగర్ కర్నూల్ పార్లమెంట్ ప‌రిధి కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్డండా మండలం పెద్దాపూర్ గ్రామంలో పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి సోమ‌వారం ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ల‌బ్ధిదారుల‌తో మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

S

Telangana | Published On Jun 1, 2026, 5.33 pm IST

MP Mallu Ravi | ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు.. ల‌బ్ధిదారుల్లో సంతోషం నింపారు
Advertisement

MP Mallu Ravi | త్రినేత్ర‌.న్యూస్: నాగర్ కర్నూల్ పార్లమెంట్ ప‌రిధి కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్డండా మండలం పెద్దాపూర్ గ్రామంలో పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి సోమ‌వారం ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి పూజ‌లు చేశారు. అనంత‌రం ల‌బ్ధిదారుల‌తో మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ల‌బ్ధిదారులు సంతోషం వ్య‌క్తం చేశారు.

అనంత‌రం అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణ పథకం ద్వారా సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను నాయకులు వివరించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేద కుటుంబాలకు గృహ భద్రత కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Advertisement
Advertisement