Vinodkumar | సీఈసీ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి
Vinodkumar | కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్ (Gnanesh Kumar) స్వచ్ఛందంగా తప్పుకోవాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్ సూచించారు. లేదంటే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుని రాష్ట్రపతికి నివేదించాలని కోరారు.
- లేదంటే సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకుని రాష్ట్రపతికి నివేదించాలి
- ప్రధాని ఆయనను తొలగించేలా చర్యలు తీసుకోవాలి
- సీఈసీ తప్పుకోవాలని బీఆర్ఎస్ పక్షాన గట్టిగా చెప్పాలనుకుంటున్నాం
- ఈ విషయాన్ని నిరక్షరాస్యులు కూడా మాట్లాడుకుంటున్నారు
- మీడియా సమావేశంలో మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్
Vinodkumar |త్రినేత్ర న్యూస్: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్ (Gnanesh Kumar) స్వచ్ఛందంగా తప్పుకోవాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్ సూచించారు. లేదంటే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుని రాష్ట్రపతికి నివేదించాలని కోరారు. ప్రధాని మోదీ (Modi) అయినా ఆయనను తొలగించే చర్యలు చేపట్టాలన్నారు. సామాన్య ప్రజలకే అనుమానాలు వచ్చాయంటే ప్రజాస్వామ్యం నిలబడే పరిస్థితి లేదన్నారు. ఇది చిన్నపాటి రాజ్యాంగ సంక్షోభమేనని అభివర్ణించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే సీఈసీ నియామకం కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు.
బెంగాల్‌లో ఆ ప్రభావం కనిపిచింది..
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వివాదాస్పద నిర్ణయాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వివాదాస్పద నిర్ణయాలతో ఎలక్షన్ కమిషన్ ప్రతిష్ట దెబ్బ తిన్నది. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు సహా కమిషనర్లు వ్యతిరేకించినా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఓ ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక సంచలన వార్త ప్రచురించింది. కేంద్ర ఎన్నికల సంఘం సర్ పేరిట అన్యాయంగా ఓట్లు తొలగించిందనే ఆరోపణలు వస్తున్నా యి. ఇటీవల ఎన్నికలు జరిగిన బీహార్ పశ్చిమ బెంగాల్‌లో ఆ ప్రభావం కనిపించింది.
ఎవరు గెలవాలో చెప్పేది కాదు..
బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగించింది అని అర్థమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర రాజ్యాంగబద్ద సంస్థ. ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలి అనేది నిర్ధారణ చేసేది కాదు. ఎంత గొప్ప వ్యక్తి అయిన, సామాన్యుడికైనా ఒకటే హక్కు ఉంటుంది. మోదీ తీరుతో ఎలక్షన్ కమిషన్ కు దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. సీఈసీ నియమించే ఆర్టికల్ 324 ప్రకారం పీఎం, ప్రతిపక్ష నేత, సుప్రీం చీఫ్ జస్టిస్ లతో కూడిన కమిటీ సీఈసీని నియమించే పద్ధతిని మోదీ తొలగించారు. చీఫ్ జస్టిస్ స్థానంలో కేబినెట్ మంత్రిని పెట్టారు.
వివాదాస్పద నిర్ణయాలతో ఎలక్షన్ కమిషన్ ప్రతిష్ట దెబ్బ తిన్నది. నిరక్షరాస్యులకు, చదువుకున్న వారు కూడా ఇదే చర్చ చేస్తున్నారు. నాటి ఇందిరాగాంధీ ప్రధానిగా ఎమెర్జెన్సీ తీసుకొస్తే ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ వచ్చింది. దేశ ప్రజలే ఆమెను బంగాళాఖాతంలో పడేశారు. ఎలాంటి ప్రచార సాధనాలు లేని సమయంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి.
ఇప్పుడున్న ప్రధాని ఈ ఆరోపణలు పరిగణలోకి తీసుకుని వెంటనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలి. ఈసీకి గౌరవం ఉండేది.. ఇపుడు దిగ జారింది. సీఈసీ తప్పుకోవాలని బీఆర్ఎస్ పక్షాన గట్టిగా చెప్పాలనుకుంటున్నాం. చట్టాన్ని పాత పద్ధతిలో కొనసాగిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ యిస్తే సరిపోతుంది.
ఎంపీగా పోటీకి దించడం ఎనిమిదో వింత
రాహుల్ గాంధీకి రాజ్యాంగం మీద గౌరవం లేదు. తన తండ్రి రాజీవ్ గాంధీ తెచ్చిన ఫిరాయింపుల చట్టాన్ని రాహుల్ తెలంగాణ లో ఎందుకు అమలు చేయలేదు? బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ను కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీకి దించడం ఎనిమిదో వింత ..ఇలాంటి వింతలు కేవలం రాహుల్ తోనే సాధ్యం రాష్ట్రంలో సర్ ప్రక్రియ పట్ల అనుమానాలు ఉన్నాయి. బీఎల్వోలు సరిగా లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. బీఆర్ఎస్ గెలిచిన చోట్ల ఓట్లు భారీగా తొలగించారు అని వినోద్‌కుమార్ ఆరోపించారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధి లలితా రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●TG TET | ఇంకా 7 వేల మంది టీచర్లు 'టెట్' ఫెయిల్
- ●ATM Charges | 3 రోజులు బ్యాంకుల సమ్మె.. ఏటీఎం చార్జీలపై ఖాతాదారులకు ఊరట..
- ●CJI Surya Kant | ప్రతి ఐదుగురు టీనేజర్లలో ఒకరికి డ్రగ్స్ ముప్పు: సీజేఐ
- ●N Ramachander Rao | కుటుంబవాదం భారత ప్రజాస్వామ్యానికే ముప్పు : ఎన్ రామచందర్ రావు
- ●Satyam Srirangam | జ్ఞానేశ్ కుమార్ అక్రమాలపై రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
- ●Ram Charan | దసరాకు రామ్‌చరణ్, సుకుమార్ మూవీ లాంఛ్ - గెస్ట్‌గా పవన్ కళ్యాణ్

TG TET | ఇంకా 7 వేల మంది టీచర్లు 'టెట్' ఫెయిల్

ATM Charges | 3 రోజులు బ్యాంకుల సమ్మె.. ఏటీఎం చార్జీలపై ఖాతాదారులకు ఊరట..

CJI Surya Kant | ప్రతి ఐదుగురు టీనేజర్లలో ఒకరికి డ్రగ్స్ ముప్పు: సీజేఐ

N Ramachander Rao | కుటుంబవాదం భారత ప్రజాస్వామ్యానికే ముప్పు : ఎన్ రామచందర్ రావు



