త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | బీజేపీకి మూడింది.. దాని మెడ‌లు వంచుడే ఇగ‌

Ponnam Prabhakar | ఢిల్లీలో నిర‌స‌న‌లు తెల‌ప‌నీయ‌కుండా ద‌మ‌న‌కాండ చేస్తున్న బీజేపీకి మూడింద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ హెచ్చ‌రించారు. ఎమ‌ర్జెన్సీలో కూడా ఇలా జ‌ర‌గ‌లేద‌ని నిర‌స‌న‌లో పాల్గొనేవాళ్లు చెప్తున్నార‌ని వివ‌రించారు.

S

Telangana | Published On Oct 10, 2026, 1.05 pm IST

Ponnam Prabhakar | బీజేపీకి మూడింది.. దాని మెడ‌లు వంచుడే ఇగ‌
Advertisement
  • నిర‌స‌న తెలిపే హ‌క్కును హ‌రిస్తున్న‌రు
  • ఢిల్లీలో నియంతృత్వానికి ప‌రాకాష్ఠ ఇది
  • ఎక్స్ వేదిక‌గా ఖండించిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్: ఢిల్లీలో నిర‌స‌న‌లు తెల‌ప‌నీయ‌కుండా ద‌మ‌న‌కాండ చేస్తున్న బీజేపీకి మూడింద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ హెచ్చ‌రించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తీసేయ‌కుండా ప్ర‌జా ర‌వాణాను బంజేసి, పోలీసుల‌ను దించి నియంతృత్వంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఢిల్లీలో జ‌రుగుతున్న ద‌మ‌న‌కాండ‌, అణ‌చివేత, నియంతృత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప‌క్షాన తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. ఈమేర‌కు శ‌నివారం ఎక్స్ వేదిక‌గా ఆయ‌న మాట్లాడారు. ఎమ‌ర్జెన్సీలో కూడా ఇలా జ‌ర‌గ‌లేద‌ని నిర‌స‌న‌లో పాల్గొనేవాళ్లు చెప్తున్నార‌ని వివ‌రించారు.

ప్ర‌జాస్వామికంగా నిర‌స‌న తెలిపే హ‌క్కు ఉంది. నియంతృత్వంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌జా ర‌వాణాను బంజేస్తూ వేలాది మంది పోలీసులను దించారు. పూర్తిగా నియంతృత్వానికి ఇది ప‌రాకాష్ఠ అనేవిధంగా కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న ఢిల్లీలోని సంఘ‌ట‌న‌లు చూస్తే అర్థ‌మైతుంది. ప్ర‌జాస్వామ్యం ఎక్క‌డ‌వోతుందో అనే ఆందోళ‌న ప్ర‌జ‌ల్లో నెల‌కొంది. న‌రేంద్ర మోదీ, అమిత్ షా క‌నీస బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్త‌లేరు.

ప్ర‌జాస్వామ్యానికి ఓటు హ‌క్కే ఆయుధం. ఆ ఓటు హ‌క్కును కోల్పోతున్న ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లున్నరు. అందుకు బాధ్యులైన జ్ఞానేశ్‌కుమార్‌ను తొల‌గించాల‌నే ఆలోచ‌న లేకుండా మెట్రోలు బంజేసి, రైళ్లు బంజేసి, పోలీసుల‌ను దించి ఎవ‌ర్ని రాకుండా జేసి, అరెస్టు చేస్తున్న‌రు. నిర్బంధం పెట్టి ద‌మ‌న‌కాండ చేస్తున్న ఈ కేంద్ర ప్ర‌భుత్వానికి మూడింది.

త‌ల దించాల్సిందే..

వాళ్ల ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ సీటు ఖాళీ చేసి ఓడిపోవ‌డం కాన్నుంచి, ఓటు కొల్ల‌గొడుతూ ఓటు దొంగ‌త‌నం చేస్తున్న‌ప్ప‌టి నుంచి బీజేపీకి తిరోగ‌మ‌నం షురువైంది. స్వాతంత్య్రం కోసం అప్పుడు ఎట్ల కొట్లాడిర్రో.. ఈనాడు రాజ్యాంగాన్ని కాపాడ్డానికి, ఓటును ర‌క్షించ‌డానికి ఈరోజు ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న‌య్‌. బీజేపీ మెడ‌లు వంచాల్సిందే. అది త‌ల దించాల్సిందే. జ్ఞానేశ్‌కుమార్‌ను తొల‌గించి ఓట్ల స‌వ‌ర‌ణ కార్య‌క్ర‌మంలో సామాన్యులు ఓటు హ‌క్కు కోల్పోకుండా చూడాల‌ని డిమాండ్ చేస్తున్నం అని పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement