త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSWREIS Recruitment | గురుకులాల్లో 117 పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు ముగుస్తున్న గ‌డువు

TGSWREIS Recruitment | తెలంగాణ సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల సొసైటీ (TGSWREIS) పరిధిలోని ఫౌండేషన్, స్పోర్ట్స్, సీవోఈల్లో (Center of Excellence) ఐఐటీ, జేఈఈ, యూపీఎస్సీ, సీఎంఈ, క్లాట్ కోర్సులకు సంబంధించిన ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

G

Telangana | Published On Jun 29, 2026, 1.02 pm IST

TGSWREIS Recruitment | గురుకులాల్లో 117 పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు ముగుస్తున్న గ‌డువు
Advertisement

TGSWREIS Recruitment | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల సొసైటీ (TGSWREIS) పరిధిలోని ఫౌండేషన్, స్పోర్ట్స్, సీవోఈల్లో (Center of Excellence) ఐఐటీ, జేఈఈ, యూపీఎస్సీ, సీఎంఈ, క్లాట్ కోర్సులకు సంబంధించిన ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. దీనిద్వారా 117 పోస్టుల‌ను తాత్కాలిక (గౌరవ వేతనం) ప్రాతిపదికన నియమించ‌నుంది. అర్హత, అనుభవం కలిగిన సబ్జెక్ట్ నిపుణులు ద‌ర‌ఖాస్తు చేసుకోచ్చు. మంగ‌ళ‌వారంతో (జూన్ 30) గ‌డువు ముగియ‌నుంది. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నుంది.

మొత్తం ఖాళీలు: 117
ఫౌండేష‌న్‌, స్పోర్ట్స్ సీఓఈలు 50 (మ్యాథ్స్ 11, ఫిజిక్స్ 6, కెమిస్ట్రీ 5, బాట‌నీ 6, జూవాల‌జీ 7, సీఎంఏ 5, క్లాట్ 4, యూపీఎస్సీ 6)
డిస్ట్రిక్ట్ సీఓఈలు 67 (మ్యాథ్స్ 10, ఫిజిక్స్ 12, కెమిస్ట్రీ 10, బాట‌నీ 16, జూవాల‌జీ 19)

అర్హ‌త‌లు
జేఈఈ, నీట్‌- అభ్య‌ర్థులు సంబంధిత స‌బ్జెక్టులో పీజీ చేసి, ఐదేండ్ల బోధ‌న అనుభవం ఉండాలి.
సీఎంఏ- అకౌంటింగ్‌, ఎక‌నామిక్స్‌, బీజినెస్ మ్యాథ్స్‌, ఫండ‌మెంట‌ల్స్ ఆఫ్ లాస్ లో పీజీ, ఎల్ఎల్‌బీ లేదా ఎంబీఏ చేయాలి. సీఎంఏ బోధ‌న‌లో 5 ఏండ్ల అనుభ‌వం త‌ప్ప‌నిసరి.
క్లాట్‌- లీగ‌ల్ రీజ‌నింగ్‌, లాజిక‌ల్ రీజ‌నింగ్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌లో పీజీ, ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం చేసి ఉండాలి. క్లాట్ బోధ‌న‌లో క‌నీసం 5 ఏండ్ల బోధ‌న అనుభ‌వం ఉండాలి.
యూపీఎస్సీ- సంబంధిత స్జెక్టుల్లో పీజీ చేసి, బోధ‌న‌లో 3 ఏండ్ల అనుభ‌వం త‌ప్ప‌నిసరి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా. రాత‌పరీక్ష‌లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసి, ఆయా సెంటర్ల వారీగా (ఫౌండేషన్, స్పోర్ట్స్, డిస్ట్రిక్ట్ COEs) విడిగా ఇంటర్వ్యూలు మరియు డెమోలకు పిలుస్తారు. డిస్ట్రిక్ట్ COEs మరియు ఫౌండేషన్/స్పోర్ట్స్ COEs ఎంచుకున్న అభ్యర్థులకు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఎంపికైన ఫ్యాకల్టీ తమకు కేటాయించిన కాలేజీలలో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో
అభ్యర్థులు సొసైటీ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి వివరాలతో రాష్ట్ర కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
అడ్ర‌స్‌- ది స్టేట్ ఆఫీసర్, టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ (TGSWREI Society), హౌస్ నెం. 13-23-16, శ్రీరామ్‌నగర్, చైతన్యపురి మెట్రో స్టేషన్ ఎదురుగా, పిల్లర్ నంబర్. 1570 (నవతా ట్రాన్స్‌పోర్ట్ గల్లీ), సరూర్ నగర్ (మండలం), రంగారెడ్డి జిల్లా, పిన్ - 500060

ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేదీ: జూలై 30
రాత‌ప‌రీక్ష‌: జూలై 12న
వెబ్‌సైట్: https://tgswreis.telangana.gov.in/

పూర్తి వివ‌రాల‌కు..

Advertisement
Advertisement