త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు స్టైపెండ్ పెంపు

Ponnam Prabhakar | తెలంగాణ‌లోని చదువుకున్న నిరుద్యోగ యువత‌ను మరింత ప్రోత్సహించే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 బీసీ స్టడీ సర్కిల్‌ల‌లో పోటీ పరీక్షలకు కోచింగ్‌ను తీసుకుంటున్న విద్యార్థులకు అందించే స్టైపెండ్ మొత్తాన్ని పెంచామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.

S

Telangana | Published On Nov 6, 2026, 5.54 pm IST

Ponnam Prabhakar | బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు స్టైపెండ్ పెంపు
Advertisement

సివిల్ సర్వీస్ కోచింగ్ విద్యార్థులకు
నెల స్టైపెండ్‌ను రూ. 5 వేల నుంచి రూ. 7 వేలకు
ఫౌండేషన్ కోర్సు విద్యార్థులకు
రూ. 1000 నుంచి రూ. 1500కు స్టైపెండ్ పెంపు
వార్షిక బుక్ ఫండ్ రూ. 5 వేల‌ నుంచి రూ. 10 వేలకు పెంపు
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ‌లోని చదువుకున్న నిరుద్యోగ యువత‌ను మరింత ప్రోత్సహించే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 బీసీ స్టడీ సర్కిల్‌ల‌లో పోటీ పరీక్షలకు కోచింగ్‌ను తీసుకుంటున్న విద్యార్థులకు అందించే స్టైపెండ్ మొత్తాన్ని పెంచామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.

యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ ఉచిత కోచింగ్‌కు ఎంపికైన యువతీయువకుల నెలవారీ స్టైపెండ్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 5 వేల నుంచి రూ. 7 వేలకు పెంచామని, బుక్ ఫండ్ పేరిట ప్రతియేటా ఒకసారి ఇస్తున్న మొత్తాన్ని రూ. 5 వేల నుంచి రూ. 10 వేల పెంచామని, ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే గ్రూప్ వన్, టు, త్రీ, ఫోర్, బ్యాంకింగ్ సర్వీస్, రైల్వే రిక్రూట్మెంట్, స్టాఫ్ సెలక్షన్ ఉద్యోగాలకు ఉద్దేశించిన ఫౌండేషన్ కోర్సులో కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఇప్పటివరకూ ఇస్తున్న స్టైపెండ్ నెలకు రూ. 1000 నుంచి రూ. 1500లకు పెంచామ‌ని, ఈ న‌వంబ‌ర్ నుంచి అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు.

ప్రతి బిసి స్టడీ సర్కిల్ సొంత భవనాలలో స్టడీ రూమ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్ర‌టరీ రాహుల్ బొజ్జా, కమిషనర్ బాల మాయా దేవి, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ ఇతరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement