త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC Union Elections | పదేండ్ల త‌ర్వాత ఆర్టీసీలో ఎన్నిక‌లు.. ప్ర‌చారం షురూ

TGSRTC Union Elections | తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌లో ప‌దేండ్ల త‌ర్వాత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల్లో ఆయా కార్మిక సంఘాల నేత‌లు ప్ర‌చారం షురూ చేశారు.

S

Telangana | Published On Sep 19, 2026, 6.28 am IST

TGSRTC Union Elections | పదేండ్ల త‌ర్వాత ఆర్టీసీలో ఎన్నిక‌లు.. ప్ర‌చారం షురూ
Advertisement

TGSRTC Union Elections | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌లో ప‌దేండ్ల త‌ర్వాత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల్లో ఆయా కార్మిక సంఘాల నేత‌లు ప్ర‌చారం షురూ చేశారు. 97 డిపోల్లో 37 వేల మంది ఉద్యోగుల ఓట్ల‌ను ఆక‌ర్షించే విధంగా ప్ర‌చారానికి దిగారు. ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ దాదాపు నెల రోజుల పాటు కొన‌సాగ‌నుంది. నిన్న షెడ్యూల్ విడుద‌ల కాగా, అక్టోబ‌ర్ 9న ఎన్నిక‌లు నిర్వ‌హించి 17న ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్నారు. ఇక చివ‌రిసారిగా 2016 జులై 19న గుర్తింపు కార్మిక సంఘాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా, 2019లో కాల‌ప‌రిమితి ముగిసింది.

ఆర్టీసీ సంఘాల ఎన్నికల పూర్తి షెడ్యూల్ ఇదే

  • సెప్టెంబర్ 18: ఎన్నికల షెడ్యూల్ విడుదల
  • సెప్టెంబర్ 21: ఎన్నికల్లో పోటీ చేయడానికి సంఘాల సమ్మతి
  • సెప్టెంబర్ 22: యూనియన్లకు ఓటర్ ​లిస్ట్ అందించడంతో పాటు అభ్యంతరాల స్వీకరణ ప్రారంభం
  • సెప్టెంబర్ 24: ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు దాఖలు చేసే అవకాశం
  • సెప్టెంబర్ 25: సంఘాలకు తుది ఓటర్ల జాబితా అందజేత
  • సెప్టెంబర్ 26: యూనియన్లకు ఎన్నికల గుర్తుల కేటాయింపు, రిటర్నింగ్ అధికారికి తుది ఓటర్ల జాబితా అప్పగింత
  • సెప్టెంబర్ 29: యూనియన్లకు నమూనా బ్యాలెట్ పత్రాల సమర్పణ
  • అక్టోబర్ 09: ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
  • అక్టోబర్ 14, 15: పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్
  • అక్టోబర్ 17: ఫలితాల వెల్లడి
Advertisement
Advertisement