Conductor Posts | రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి.. 1,500 కండక్టర్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్!
Conductor Posts | ఆర్టీసీ (TGS RTC) మరో నియామక ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే 3 వేలకుపైగా డ్రైవర్, శ్రామిక్ పోస్టులను భరీ చేస్తున్నది. తాజాగా 1500 కండక్టర్ పోస్టుల (Conductor Posts) భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
Conductor Posts | త్రినేత్ర.న్యూస్: ఆర్టీసీ (TGS RTC) మరో నియామక ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే 3 వేలకుపైగా డ్రైవర్, శ్రామిక్ పోస్టులను భరీ చేస్తున్నది. తాజాగా 1500 కండక్టర్ పోస్టుల (Conductor Posts) భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నియామకాలను ఆర్టీసీ యాజమాన్యమే చేపట్టనుంది. పదో తరగతి (SSC Marks) మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఉద్యోగుల్ని ఎంపిక చేయనుంది. దీంతో తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆర్టీసీలో కండక్టర్ పోస్టులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. ఏటా ఉన్న ఉద్యోగులే రిటైరవుతుండటంతో ఖాళీలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ మేరకు కొంతకాలం క్రితం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా హైదరాబాద్, సికింద్రాబాద్ సహా వివిధ రీజియన్ల పరిధిలోని డిపోల్లో కండక్టర్లను నియమించింది. ఇప్పుడు ప్రభుత్వం అనుమతించడంతో 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి రెడీ (Conductor Recruitment) అవుతున్నది.
అయితే నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ఆర్టీసీ ఒక సాంకేతిక సమస్యను పరిష్కరించాల్సిన అవసరం వచ్చింది. సాధారణంగా కండక్టర్ ఉద్యోగాలను పదో తరగతి మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేస్తారు. అయితే పదోతరగతి మార్కులకు గతంలో జీపీఏ గ్రేడింగ్ విధానం ఉండేది. ప్రస్తుతం మార్కుల విధానం అమల్లోకి వచ్చింది. దీంతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొందరికి మార్కులు, మరికొందరికి గ్రేడింగ్ పాయింట్లు ఉండే అవకాశం ఉంది. ఈ రెండింటినీ సమానంగా ఎలా అంచనా వేయాలనే అంశంపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేడింగ్ పాయింట్లను మార్కుల శాతంలోకి ఎలా మార్చాలనే దానిపై క్లారిటీ ఇవ్వాలని ఎస్సెస్సీ బోర్డుకు లేఖ రాశారు. బోర్డు నుంచి స్పష్టత వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం





