TGSPDCL | పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా : టీజీఎస్పీడీసీఎల్
TGSPDCL | పరిశ్రమల అభివృద్ధికి నాణ్యమైన, నిరంతర విశ్వసనీయ విద్యుత్ సరఫరా అందించడంలో టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన లక్ష్యంగా, పరిశ్రమల ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల ప్రాధాన్యతతో, సత్వర పరిష్కరించడంలో సంపూర్ణ సహకారం అందిస్తామని సీఎండీ జితేష్ వి. పాటిల్ తెలిపారు.
పరిశ్రమల అభివృద్ధికి టీజీఎస్పీడీసీఎల్ కట్టుబడి ఉంది
పరిశ్రమల సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం
సీఎండీ జితేష్ వి. పాటిల్
TGSPDCL | త్రినేత్ర.న్యూస్ : పరిశ్రమల అభివృద్ధికి నాణ్యమైన, నిరంతర విశ్వసనీయ విద్యుత్ సరఫరా అందించడంలో టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన లక్ష్యంగా, పరిశ్రమల ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల ప్రాధాన్యతతో, సత్వర పరిష్కరించడంలో సంపూర్ణ సహకారం అందిస్తామని సీఎండీ జితేష్ వి. పాటిల్ తెలిపారు.
హైదరాబాద్‌లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI) నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని, పరిశ్రమల ప్రతినిధుల నుంచి పలు సూచనలు, సమస్యలు తెలుసుకున్నారు.
సమావేశంలో పారిశ్రామిక ప్రాంతాల్లో తరచు విద్యుత్ అంతరాయాలు, విద్యుత్ బిల్లింగ్ సమస్యలు, కొత్త విద్యుత్ కనెక్షన్‌కు పట్టే సమయం, లోఓల్టేజ్ దాఖవారీగా ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు, విద్యుత్ పరికరాల లభ్యత, క్యాప్టివ్ పవర్ వినియోగానికి ట్రాన్స్ సప్లై సర్దుబాటు, కొత్త కనెక్షన్‌కు అవసరమైన పత్రాలపై ఆధారంగా తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. పరిశ్రమల ప్రతినిధులు విద్యుత్ సరఫరాలో విశ్వసనీయత పెంచు, సేవల మరింత సరళీకరణ, డిజిటల్ సత్వర పరిష్కారం, విద్యుత్ కనెక్షన్ మంజూరు ప్రక్రియ వేగం పెంచడం కోరారు.
ఈ సందర్భంగా సీఎండీ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ.. పరిశ్రమల అభివృద్ధి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమని, పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ నిరంతర కృషి చేస్తోందని తెలిపారు. పరిశ్రమల ప్రతినిధులు లేవనెత్తిన ప్రతి అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరిశ్రమలతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ, విద్యుత్ సేవలను మరింత మెరుగుపరచేందుకు ఇలాంటి సమీక్షా సమావేశాలను తరచు నిర్వహిస్తామని తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






