త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Entrance Exams | ఫిబ్రవ‌రి మొద‌టివారంలో ఈసెట్‌, లాసెట్ నోటిఫికేష‌న్లు.. ద‌ర‌ఖాస్తులు ఎప్ప‌టి నుంచంటే?

Entrance Exams | వ‌చ్చే ఏడాదికి వివిధ కోర్సుల్లో ప్ర‌వేశాలు (Entrance Exams) క‌ల్పించేందుకు రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి (TGSCHE) స‌మాయ‌త్త‌మ‌వుతున్న‌ది. ఇప్ప‌టికే సెట్‌ల క‌మిటీల‌ను, చైర్మ‌న్ల‌ను నియ‌మించింది. ఈ క్ర‌మంలో ఈసెట్ (ECET), లాసెట్ (LAW Cet) ద‌ర‌ఖాస్తుల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించింది.

G

Telangana | Published On Jan 28, 2026, 1.16 pm IST

Entrance Exams | ఫిబ్రవ‌రి మొద‌టివారంలో ఈసెట్‌, లాసెట్ నోటిఫికేష‌న్లు.. ద‌ర‌ఖాస్తులు ఎప్ప‌టి నుంచంటే?
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌స్తుత విద్యాసంవ‌త్స‌రం మ‌రో రెండు మూడు నెల‌ల్లో ముగియ‌నుంది. దీంతో వ‌చ్చే ఏడాదికి వివిధ కోర్సుల్లో ప్ర‌వేశాలు (Entrance Exams) క‌ల్పించేందుకు రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి (TGSCHE) స‌మాయ‌త్త‌మ‌వుతున్న‌ది. ఇప్ప‌టికే సెట్‌ల క‌మిటీల‌ను, చైర్మ‌న్ల‌ను నియ‌మించింది. ఈ క్ర‌మంలో ఈసెట్ (ECET), లాసెట్ (LAW Cet) ద‌ర‌ఖాస్తుల షెడ్యూల్‌ను ఉమ్మ‌డి ప్రవేశ పరీక్షల కమిటీ ప్ర‌క‌టించింది.

వ‌చ్చే నెల 5న ఈసెట్‌, ఫిబ్ర‌వ‌రి 10న లాసెట్ నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌నుంది. ఇక ఈసెట్‌కు ఫిబ్రవరి 9 నుంచి, లాసెట్‌కు 10 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ‌మ‌వుతాయి. ఇంటర్‌ విద్యార్హతతో ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీ, డిగ్రీ విద్యార్హతపై మూడేండ్ల‌ ఎల్‌ఎల్‌బీ, లా డిగ్రీ పూర్తయిన వారికి రెండేండ్ల‌ ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్‌ నిర్వహిస్తారు. అలాగే, పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ(గణితం) పూర్తి చేసిన వారు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో చేరేందుకు ఈసెట్‌ నిర్వహిస్తారు.

గతంతో పోల్చితే ఈ ఏడాది దాదాపు 20 రోజుల ముందుగానే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతున్న‌ది. ఏటా లాసెట్ అభ్య‌ర్థుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో ఆన్‌లైన్‌ ద‌రఖాస్తుల‌ను బట్టి పరీక్షా కేంద్రాలను నిర్ణ‌యించ‌నున్నారు.

Advertisement
Advertisement