త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG TET | నేటి నుంచి టీజీ టెట్ ద‌ర‌ఖాస్తులు షురూ..

TG TET | ఉపాధ్య‌య అర్హ‌త ప‌రీక్ష (TG TET)ను ప్ర‌భుత్వం ఏటా రెండుసార్లు నిర్వ‌హిస్తున్న‌ది. ఇందులో భాగంగా టెట్ దరఖాస్తులు (Applications) సోమ‌వారం ప్రారంభ‌మ‌వుతున్నాయి. డిసెంబర్ 10 వరకు ఆన్‌లైన్‌లో అప్ల‌య్‌ చేసుకోవచ్చు.

G

Telangana | Published On Nov 16, 2026, 6.59 am IST

TG TET | నేటి నుంచి టీజీ టెట్ ద‌ర‌ఖాస్తులు షురూ..
Advertisement

TG TET | త్రినేత్ర న్యూస్‌: ఉపాధ్య‌య అర్హ‌త ప‌రీక్ష (TG TET)ను ప్ర‌భుత్వం ఏటా రెండుసార్లు నిర్వ‌హిస్తున్న‌ది. ఇందులో భాగంగా టెట్ దరఖాస్తులు (Applications) సోమ‌వారం ప్రారంభ‌మ‌వుతున్నాయి. డిసెంబర్ 10 వరకు ఆన్‌లైన్‌లో అప్ల‌య్‌ చేసుకోవచ్చు. జనవరి 3 నుంచి 15 వరకు కంప్యూటర్ ఆధారిత (CBT) పరీక్షలు జరుగుతాయి.

అర్హ‌త‌లు: డీఎల్‌ఈడీ , డీఈడీ , బీఈడీ, లాంగ్వేజ్ పండిట్ కోర్సులు పూర్తి చేసిన వారితో పాటు, ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా టెట్ రాయడానికి అర్హులు. గతంలో టెట్ క్వాలిఫై అయిన వారు తమ స్కోరు పెంచుకోవడానికి (ఇంప్రూవ్‌మెంట్) మరోసారి అప్లై చేసుకోవచ్చు. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. ఉపాధ్యాయ నియామక పరీక్షలో టెట్ స్కోరుకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. పరీక్షలో అర్హ‌త సాధించాలంటే జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు 40 శాతం ఆపై మార్కులు రావాలి.

పేపర్-1 (Paper-I): 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు (ప్రైమరీ స్కూల్) బోధించాలనుకునే అభ్యర్థుల కోసం.
పేపర్-2 (Paper-II): 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు (అప్పర్ ప్రైమరీ) బోధించాలనుకునే అభ్యర్థుల కోసం.
అర్హత కలిగిన అభ్యర్థులు 1 నుంచి 8వ తరగతి వరకు బోధించేందుకు వీలుగా రెండు పేపర్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప‌రీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)గా. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం సెషన్ 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2 గంటల నుంచి 4.30 గంటల వరకు ఉంటుంది. మొత్తం 150 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: జ‌న‌ర‌ల్‌, బీసీ అభ్య‌ర్థుల‌కు ఒక పేపర్‌కు రూ. 750, రెండు పేపర్లకు కలిపి రూ. 1,000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒక పేపర్‌కు రూ. 700, రెండు పేపర్లకు కలిపి రూ. 950.
దరఖాస్తులకు చివరి తేదీ: 2026 డిసెంబర్ 10
హాల్ టికెట్ల డౌన్‌లోడ్: 2026 డిసెంబర్ 28
TET పరీక్షల తేదీలు: 2027 జనవరి 3 నుంచి 15
ఫలితాలు: ఫిబ్రవరి రెండో వారం (2027 ఫిబ్రవరి 8 నుంచి 12 మధ్యలో)
వెబ్‌సైట్: https://schooledu.telangana.gov.in

Advertisement
Advertisement