Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు..!
Inter Exams | ఇంటర్మీడియట్ (Intermediate) విద్యార్థులకు అలర్ట్. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వార్షిక పరీక్షలను (Inter Exams) ఫ్రిబవరి 24 నుంచి నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సన్నద్ధమవుతున్నది.
Inter Exams | త్రినేత్ర న్యూస్: ఇంటర్మీడియట్ (Intermediate) విద్యార్థులకు అలర్ట్. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వార్షిక పరీక్షలను (Inter Exams) ఫ్రిబవరి 24 నుంచి నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు సబ్జెక్టుల వారీగా సమగ్ర పరీక్షా షెడ్యూల్‌ను రూపొందించే ప్రక్రియను అధికారులు దాదాపు కొలిక్కి తెచ్చారు. ఒకవేళ ఫిబ్రవరి 24న పరీక్షలు ప్రారంభించడం సాధ్యం కాకపోతే, మార్చి 3 నుంచి మొదలుపెట్టేలా ప్రత్యామ్నాయ షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్‌ను ప్రారంభించనున్నారు. ఏడాది నుంచి ఇంటర్ ఫస్టియర్ సైన్స్ గ్రూప్ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ (Inter Practicals) నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
జేఈఈ (JEE) వంటి ప్రవేశ పరీక్షల సన్నద్ధకు ఇబ్బంది కలగకుండా ఇంటర్ పరీక్షలను ఫిబ్రవరిలోనే ప్రారంభించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ పరీక్షలు ఆలస్యమైతే, విద్యార్థులకు జేఈఈ మెయిన్, ఎంసెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు (Entrance Exams) సిద్ధం కావడానికి తగినంత సమయం ఉండదు. ఇంటర్ పరీక్షల తర్వాతే పదో తరగతి బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉంటుంది.
కాగా, ఇంటర్మీడియట్ పరీక్షల రుసుము చెల్లింపునకు నవంబర్ 9తో గడువు ముగియనుంది. ఎలాంటి ఆలస్య రుసుము (పెనాల్టీ) లేకుండా ఎగ్జామ్ ఫీజు చెల్లించొచ్చు. నిర్ధిష్ట గడువులోగా చెల్లించకపోతే డిసెంబర్ 14 వరకు ఆలస్య రుసుముతో ఫిజు చెల్లించవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఒక్క రోజులోనే రూ.33వేలు తగ్గిన పసిడి ధర..
- ●US Stock Markets | అమెరికా టెక్ మార్కెట్లలో 2.4 లక్షల కోట్ల డాలర్లు ఆవిరి.. ఏఐ పెట్టుబడులే కారణమా?
- ●Cotton Imports | టెక్స్టైల్స్ రంగానికి కేంద్రం భారీ ఊరట.. పత్తి దిగుమతులపై సుంకం మినహాయింపు గడువు పొడిగింపు
- ●Electric Shock | అర్ధరాత్రి దావత్.. పోలీసులను చూసి పరిగెత్తి.. కరెంట్ షాక్‌తో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
- ●Shehbaz Sharif | భారత్‌పై పాక్ గెలుపు.. ప్రధాని షరీఫ్‌పై నెట్టింట ట్రోల్స్
- ●Rain Alert | రానున్న మూడు రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఒక్క రోజులోనే రూ.33వేలు తగ్గిన పసిడి ధర..

US Stock Markets | అమెరికా టెక్ మార్కెట్లలో 2.4 లక్షల కోట్ల డాలర్లు ఆవిరి.. ఏఐ పెట్టుబడులే కారణమా?

Cotton Imports | టెక్స్టైల్స్ రంగానికి కేంద్రం భారీ ఊరట.. పత్తి దిగుమతులపై సుంకం మినహాయింపు గడువు పొడిగింపు

Electric Shock | అర్ధరాత్రి దావత్.. పోలీసులను చూసి పరిగెత్తి.. కరెంట్ షాక్‌తో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి






