TGS RTC | నీట్ రీ-ఎగ్జామ్.. ఆర్టీసీ బస్సుల్లో అభ్యర్థులకు ఉచిత ప్రయాణం..
TGS RTC | నీట్ (NEET) యూజీ రీ-ఎగ్జామ్ ఈ నెల 21న జరుగనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) గుడ్‌న్యూస్ చెప్పింది. నీట్ అభ్యర్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది.
TGS RTC | త్రినేత్ర.న్యూస్: నీట్ (NEET) యూజీ రీ-ఎగ్జామ్ ఈ నెల 21న జరుగనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) గుడ్‌న్యూస్ చెప్పింది. నీట్ అభ్యర్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది. విద్యార్థులు హాల్ టికెట్‌ను చూపించి, తమ ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రాల వరకు, తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఉచితంగా రాకపోకలు సాగించవచ్చు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. ఈ ప్రత్యేక ఉచిత ప్రయాణ సదుపాయం సంస్థకు చెందిన ఏసీ సర్వీసులు మినహాయించి అన్ని బస్సులలో అందుబాటులో ఉంటుందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు దాదాపు 73 వేల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల మార్గాలలో తగినన్ని బస్సులను నడిపేందుకు ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 21న మొదటి సర్వీసు నుంచి అర్ధరాత్రి (00.00) వరకు ఈ సదుపాయాన్ని అభ్యర్థులు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఏదైనా ఆటంకాలు ఎదురైనట్లయితే టీజీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-2345 0033, 6815 3333లలో సంప్రదించవచ్చని సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

NEET | నీట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..
జూన్ 18, 2026

Annamalai | మీ చర్యల వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి మరింత పెరుగుతుంది.. బీజేపీ ప్రభుత్వంపై అన్నామలై విమర్శలు
జూన్ 16, 2026

NSUI Rally | నీట్ ప్రశ్నపత్రం లీక్.. ట్యాంక్‌బండ్ వద్ద ఎన్ఎస్యూఐ భారీ ర్యాలీ
జూన్ 13, 2026
తాజావార్తలు
- ●PhonePe | ఫోన్‌పే యూజర్లకు షాక్.. వాలెట్ వాడకపోతే రూ.100 చార్జీలు కట్టాల్సిందే..
- ●N Ramchander Rao | ప్రపంచానికి భారత్ అందించిన నాగరికతా బహుమతి యోగా: రామచందర్ రావు
- ●FIFA WC 2026 | నేవెస్ కామెంట్స్‌తో రాజుకున్న వివాదం.. సోషల్ మీడియాలో రొనాల్డో అభిమానుల ఆగ్రహం
- ●Bank Holidays | వరుసగా మూడు రోజులు.. మూతపడనున్న బ్యాంకులు
- ●Morocco Vs Scotland | సూపర్ సైబరీ.. మొరాకో విక్టరీ
- ●Brazil Vs Haiti | బ్రెజిల్‌కు తొలి విజయం.. హైతీపై 3-0 తేడాతో గెలుపు

PhonePe | ఫోన్‌పే యూజర్లకు షాక్.. వాలెట్ వాడకపోతే రూ.100 చార్జీలు కట్టాల్సిందే..

N Ramchander Rao | ప్రపంచానికి భారత్ అందించిన నాగరికతా బహుమతి యోగా: రామచందర్ రావు

FIFA WC 2026 | నేవెస్ కామెంట్స్‌తో రాజుకున్న వివాదం.. సోషల్ మీడియాలో రొనాల్డో అభిమానుల ఆగ్రహం

Bank Holidays | వరుసగా మూడు రోజులు.. మూతపడనున్న బ్యాంకులు



